Rashmika Mandanna :
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అనేది అందరికి తెలుసు.. ఈ రంగుల ప్రపంచంలో పైకి ఒకలా లోపల మరోలా ఉండడం అలవాటే.. కానీ ఏది ఏమైనా నిగ్రహంగా ఉండాలి.. పైకి కనిపించేదంతా నిజం కాదని సెలెబ్రెటీలకు తెలిసిన చేసేది ఏమీ లేదు.. మరి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే..
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ఎవ్వరికి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ఈమె ఒకప్పుడు సౌత్ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం.. కానీ ఇప్పుడు ఎలా కాదు.. గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుని ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపొయింది.
పుష్ప సినిమా తర్వాత ఈ అమ్మడి క్రేజ్ బాలీవుడ్ వరకు పాకింది. ప్రజెంట్ సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువుగా సినిమాలు చేస్తూ పోతుంది.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఉన్న ఈ భామ సోషల్ మీడియా వేదికగా కూడా తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ చూసి స్టార్ హీరోయిన్లకు కూడా జెలసీ అని అర్ధం అవుతుంది.
వినాయక చవితి ఫెస్టివల్ కు ముఖేష్ అంబానీ ఇచ్చిన గ్రాండ్ వేడుకలో ఈమె కూడా మెరిసింది.. ముంబయ్ లో ఉండే ప్రతీ ఒక్క స్టార్ సెలెబ్రిటీని ముఖేష్ అంబానీ వినాయక చవితి వేడుకలకు ఇన్వైట్ చేస్తారు. అలాగే రష్మిక కూడా వెళ్ళింది. ఈమె చాలా ట్రెడిషనల్ గా కనిపించి అట్రాక్ట్ చేసింది. దీంతో ఈమె ఫోటోల కోసం అందరు ఎగబడడంతో శ్రద్ధ కపూర్ జెలస్ ఫీల్ అయ్యింది.
ఈ విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు ఈ భామపై రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంత పొగరు ఏంటి చూసి కూడా చూడకుండా వెళ్లడం ఎందుకు అంటూ కడిగి పారేస్తున్నారు. రష్మికను చూసి ముఖం తిప్పుకుని వెళ్లడంతో రష్మిక సైతం హార్ట్ అయ్యింది. మరి ఈమె ఆఫర్స్ కూడా రష్మికనే వరిస్తున్నాయని అలా కోపంగా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.