వరసగా మెగా డాటర్స్ ఇలా విడిపోవడం షాకింగ్ గా ఉంది. కొందరు నిహారికదే తప్పు అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమెపై శ్రీరెడ్డి దుమారం రేపే కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఆ నాగబాబుకు కూతురును ఎలా పెంచాలో కూడా తెలియదు. కానీ రాజకీయాల్లో మాత్రం నీతులు చెబుతున్నాడు.
ఆ నిహారిక భర్తను వదిలేసి బలాదూర్ తిరిగితే ఏ భర్త అయినా విడాకులు ఇచ్చేస్తాడు. పాపం ఆ చైతన్య ఎంతో మంచి వాడని నాకు తెలిసింది. కానీ ఈ మెగా కూతురు సినిమాల్లో, వెబ్ సిరీస్ లు అంటూ అందరితో రాసుకుని, పూసుకుని తిరిగితే అతనికి మాత్రం కోపం రాదా. ఈ స్నేక్ బాబు తన కూతురును కంట్రోల్ లో పెట్టుకోవచ్చు కదా.
పెళ్లి గ్రాండ్ గా చేసి మురవడం కాదు.. ముందు కాపురాలు ఎలా చేయాలో నేర్పు అంటూ నాగబాబుపై సీరియస్ కామెంట్లు చేసింది. సాధారణంగానే మెగా ఫ్యామిలీ అటే విరుచుకుపడుతుంది శ్రీరెడ్డి. అలాంటిది ఇంత మంచి ఛాన్స్ దొరికితే ఊరుకుంటుందా.. కాకపోతే కాస్త లేటుగా వచ్చింది అంతే. ఇక ఓ యూట్యూబర్ తో నిహారిక క్లోజ్ గా తిరుగుతోందనే రూమర్లు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఇక పవన్ కల్యాణ్ మూడో భార్యతో విడాకులు అంటూ కొన్ని రూమర్లు వచ్చినా.. నిన్న పూజా కార్యక్రమంతో వాటికి చెక్ పెట్టేశాడు పవన్ కల్యాణ్.