34.1 C
India
Saturday, May 18, 2024
More

    Tax To Government : మనం ఒక కారు కొంటే ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ వెళుతుందో తెలుసా?

    Date:

    Tax To Government
    Tax To Government

    Tax To Government : ఈ రోజు వాహనం అనేది నిత్య వస్తువుగా మారిపోయింది. కొంచెం దూరం బస్సులో వెళ్లే ప్రయాణాన్ని అయినా సొంత కారులో వెళ్లాలని కుటుంబం అనుకుటుంది. దీనికి తోడు కార్ల తయారీ కంపెనీలు కూడా సీజన్లు, స్టాక్, పండుగలను బట్టి మంచి మంచి సబ్సిడీలు ఇస్తూనే ఉన్నాయి. ఇంకేముంది ప్రతీ ఇంట్లో ఏదో ఒక మినీ కారు ఉండనే ఉంటుంది. ఈ మధ్య వస్తున్న ఎలక్ట్రిక్ కార్ల వల్ల పెట్రోల్, డీజిల్ భారం తగ్గుతుండడంతో మరింత మధ్య తరగతి వ్యక్తి కూడా ఎలాగోలా కారును కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాడు.

    ఒక వాహనం తీసుకుంటే దానికి సంబంధించి ప్రభుత్వానికి మనం పన్ను కట్టకతప్పదు. దీంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు అని, రోడ్ టాక్స్ అనీ ఇవన్నీ కలుపుకొని కారు మోడల్ ప్రైజ్ లోకి వస్తాయి. ఏ మోడల్ ను మనం కొనాలనుకుంటున్నామో ఆ కారుకు సంబంధించి ఎక్స్ షోరూం ధర ఒకటి ఉంటుంది. అంటే షోరూం వరకు ఆ కారును ఆ ధరకు విక్రయిస్తారు. ఇక షోరూం నుంచి బయటకు యజమాని చేతుల్లోకి వెళ్లాలంటే మాత్రం సీజీఎస్టీ (సెంట్రల్) ఎస్ జీఎస్టీ (స్టేట్) తో పాటు కారుపై ఉన్న సెస్ కట్టాలి.

    ఉదాహరణకు. ఒక కారు ఎక్స్ షోరూం ధర సుమారుగా రూ. 10 లక్షలు ఉందనుకోండి. అందులో సీజీఎస్టీ 14 శాతం, ఎస్ జీఎస్టీ 14 శాతం, సెస్ కలుపుకొని ఆన్ రోడ్ కు రావాలంటే సుమారుగా రూ. 14 లక్షల వరుక వెళ్తుందన్న మాట. అయితే ఇప్పుడు కంపెనీలు చాలా వరకు లోన్ రూపంలో వాహనాలను ఇస్తున్నారు. దీంతో ఇటు యజమానికి, అటు షోరూంలపై పన్నుల భారం ఎంతో కొంత తగ్గుతుంది. కాబట్టి కారు తీసుకోవాలనుకునే వారు టాక్స్ లను కట్టి తీసుకోవాల్సిందే..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Financial Harassment : ఫైనాన్స్ వేధింపులతో.. కారు కు నిప్పు పెట్టిన యువకుడు..

    Financial Harassment : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని ఓ...

    March Deadline : మార్చి డెడ్ లైన్స్ మరిచిపోయారా? చివరి తేదీలు ఇవే..

    March Deadline : ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో ముగుస్తుందనే...

    Rahul Gandhi :రాహుల్ గాంధీ కారుపై దాడి !

      పశ్చిమ బెంగాల్ లోని మాల్ధార్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకారుపై...

    BIG BOSS: బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కారు పై దాడి

      బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి...