Teja Sajja : యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ-యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా బాక్సాఫీస్ మూవీ ‘హను-మాన్’. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తుంది. యువ హీరో కథానాయకుడిగా నటించిన మూవీ కొత్త రికార్డులను తిరగరాస్తుంది. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో రిలీజ్ కావడంతో సినీ అభిమానులు డైరెక్టర్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరో తేజ సజ్జ తాను పడిన కష్టాన్ని తెలియజేస్తూ చెప్పిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. హను-మాన్ లో రోకలి బండతో కొట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో తన మెడ పట్టేసిందట, తర్వాత రోజు షూటింగ్ కూడా చేయలేకపోయారట. కథలో భాగంగా హీరోకు శక్తులు వచ్చినప్పుడు గాలిలో తేలియాడే సన్నివేశాలను చాలా కష్టపడి తీయాల్సి వచ్చిందని చెప్పాడు.
ఈ సీన్ షూట్ సమయంలో దాదాపు ఆరు గంటలు గాలిలో తాళ్ల సాయంతో వేలాడుతూ ఉన్నట్లు తేజ వెల్లడించారు. క్లైమాక్స్ కోసం షూటింగ్ 40 రోజులు వరకు సాగింది. వీటిని చిత్రీకరించే సమయంలో ధుమ్ము, పొగ ఉండాలి. వీటి వల్ల కంటి చూపు పూర్తిగా దెబ్బతిన్నది. కుడి కన్ను కనిపించడంలేదని చెప్పారు.
షూటింగ్ ముగిసిన తర్వాత వైద్యుల వద్దకు వెళ్తే సర్జరీ చేయాలని సూచనలు చేశారు. అయితే తాను సినిమా విడుదలైన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని చెప్పినట్లు తేజ పేర్కొన్నారు. హను-మాన్ కోసం తేజ ఇంత కష్టపడ్డారా..? ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. 20 సంవత్సరాలపాటు ప్రతి సంక్రాంతికి సూపర్ హీరో సినిమా రిలీజ్ చేస్తానని, తనతోపాటు కొత్త డైరెక్టర్ల సినిమాలు కూడా వాటిలో ఉంటాయని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.