32.7 C
India
Monday, February 26, 2024
More

  Mahesh Babu : ఆ సినిమాలో మహేశ్‌కు కొడుకు.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పోటీ!

  Date:

  Mahesh Babu teja sajja
  Mahesh Babu and teja sajja box office

  Mahesh Babu : సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమాల జాతర మొదలవుతుంది. ప్రతీ ఏటా సంక్రాంతికి భారీ సినిమాలను బరిలో నిలుపుతారు నిర్మాతలు. ఈ సారి కూడా 4 భారీ సినిమాలు బరిలో ఉన్నాయని అనౌన్స్ మెంట్లు కూడా జరిగిపోయాయి. ఇందులో మూడు సినిమాలు స్టార్ హీరోలవి కాగా.. ఒక్క మూవీ యంగ్ హీరోది. తేజ సజ్జ హను-మాన్, విక్టరీ వెంకటేశ్ సైంధవ్, రవితేజ ఈగల్ కూడా రిలీజ్ కానున్నాయి.
  ఇందులో యంగ్ హీరో మూవీ పాన్ ఇండియాగా వస్తుంది.

  ఈ నాలుగు సినిమాల్లో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ ఉండగా.. యంగ్ స్టార్ తేజ సజ్జ ‘హను-మాన్’ కూడా ఉంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద నెక్ టు నెక్ తలపడేలా కనిపిస్తుంది. మహేశ్ బాబు సినీ కెరీర్ లో ఇప్పటి వరకు సుదీర్ఘ కాలం వాయిదా పడుకుంటూ కంప్లీట్ చేసుకున్న చిత్రం ఇదే కావచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మహేశ్ బాబు ఇంట్లో వరుస మరణాలు జరిగాయి. దీంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు జనవరి 12న రిలీజ్ అవుతుంది.

  ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక అంశం వైరల్ గా మారింది. హను-మాన్ లో హీరోగా చేస్తున్న తేజ సజ్జ ఒకప్పుడు మహేశ్ బాబు సినిమాలో మహేశ్ బాబుకే కొడుకుగా నటించాడు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మహేశ్ తోనే పోటీ పడుతున్నాడు. మహేశ్ బాబు కెరీర్ లో రెండో చిత్రంగా వచ్చిన మూవీ ‘యువరాజు’. ఈ సినిమాలో మహేశ్ కొడుకు పాత్రలో తేజ సజ్జ నటించాడు. తేజ కొన్ని సినిమాల్లో బాలనటుడిగా కనిపించాడు. ఇప్పుడు హీరోగా మారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను-మాన్ చేసి మహేశ్ బాబుకే పోటీగా వచ్చాడు.

  ఈ వైరల్ న్యూస్ పై తేజ సజ్జ స్పందించారు. తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ‘సూపర్ స్టార్ తో పోటీ ఏంటి? ఆయన పోటీ కాదు.. ఆయనతో పాటుగా’ అంటూ ట్వీట్ చేశాడు. తేజ మాటలకు మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పాటు పలువురు పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

  Share post:

  More like this
  Related

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

  Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

  Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

  Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

  Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Guntur Kaaram : ‘గుంటూరు కారం మహేష్ బాబు రేంజ్ మూవీ కాదు’

  Guntur Kaaram : విడుదలైన సినిమాలపై లోతైన విశ్లేషణకు మారుపేరైన పరుచూరి...

  #SSMB29 : మహేశ్ సరసన చెల్సియా ఇస్లాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదు..

  #SSMB29 : బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాజిక్ క్రియేట్ చేశాడు...

  Sreemanthudu : శ్రీమంతుడు వివాదానికి కారణమేంటో తెలుసా?

  Sreemanthudu : మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో 8...

  Teja Sajja : ఆ సీన్ లో కంటి చూపు కోల్పోయిన తేజ సజ్జ కానీ..

  Teja Sajja : యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ-యంగ్ హీరో తేజ...