31 C
India
Monday, April 29, 2024
More

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Date:

    Movie Breaking Records
    Hanuman Movie Breaking Records

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా హనుమాన్ సంచలనం కలిగిస్తోంది. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో కూడా ప్రభంజనం కొనసాగిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కథలో బలముంటే ఎలాంటి సినిమా అయినా సక్సెస్ సాధిస్తుందని నిరూపించింది. రికార్డులు కొల్లగొడుతోంది. పౌరాణిక, చారిత్రక చిత్రాలకు ఆదరణ తగ్గలేదని చూపిస్తోంది. విదేశాల్లోనూ హంగామా చేస్తోంది.

    ఉత్తర భారతదేశంలో హిందీ వర్షన్ దుమ్ములేపుతోంది. రెస్పాన్స్ పెరుగుతోంది. ఇప్పుడు సినిమా షోలు, స్క్రీన్ల సంఖ్య ఎక్కువవుతోంది. హనుమంతు అనే యువకుడికి దేవుడి నుంచి సూపర్ పవర్స్ రావడంతో ఏం జరిగిందనే కథాంశంతో తీసిన సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి దూసుకుపోతోంది. గ్రాఫిక్స్ మాయాజాలంతో అద్భుతమైన అనుభూతి కలిగిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో తేజ సజ్జ సరసన కన్నడ నటి నటించింది.

    వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని తదితరులు నటించారు. హనుమాన్ సినిమా వీకెండ్ లో దుమ్ములేపుతోంది. రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది. హిందీ వెర్షన్ కు ఇండియాలో రూ.12.26 కోట్ల వసూలు చేసింది. కేజీఎఫ్, చాప్టర్ 1, కేజీఎఫ్ 2, కాంతార, పుష్ప రికార్డులను బద్దలు కొట్టింది. శుక్రవారం రూ.2.15 కోట్లు, శనివారం రూ.4.05 కోట్లకు చేరింది. ఆదివారం రూ.6.06 కోట్లు వసూలు చేసుకుంది.

    ఉత్తర భారతదేశంలో రోజురోజుకు హనుమాన్ సినిమా షోల సంఖ్య పెరుగుతోంది. కత్రినా కైఫ్, విజయ్ సేతుపలి నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమా జోరు తగ్గింది. హనుమాన్ సినిమా కర్ణాటకలో కూడా రూ. 2కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఉత్తర భారతదేశంలోనూ చరిత్ర లిఖిస్తోంది. దీంతో హనుమాన్ కథ అందరికి తెగ నచ్చేసి ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Haryana: హ‌రియానా లో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

    అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ...

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

      ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు...

    Teja Sajja : దైవిక శక్తే మనలను నడిపిస్తుంది.. తేజ సజ్జా

    Teja Sajja : తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ మాగ్నమ్...

    Hanuman: హనుమాన్ చిత్రానికి యూఎస్ఏ బుకింగ్స్ ప్రారంభం

    HanuMan Bookings : యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా క్రియేటివ్...