40.3 C
India
Monday, May 6, 2024
More

    Hanuman: హనుమాన్ చిత్రానికి యూఎస్ఏ బుకింగ్స్ ప్రారంభం

    Date:

    HanuMan
    HanuMan

    HanuMan Bookings : యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హను-మ్యాన్’ థియేట్రికల్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 12వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా, దేశీయ, ఓవర్సీస్ ఏరియాల్లోని వివిధ లొకేషన్లలో ప్రీమియర్లు వేస్తున్నారు.

    సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్, నిర్వాణ సినిమాస్ కలిసి ‘హను-మ్యాన్’ను ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నాయి. జనవరి 11వ తేదీ యూఎస్ ప్రీమియర్స్ జరగనుండగా. ఈ రోజు (డిసెంబర్ 4) ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

    ‘హను-మ్యాన్’ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి. ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ హైప్ ను పెంచింది. టీజర్ మొదలు ఇటీవల విడుదలైన ట్రైలర్, సాంగ్స్ వరకు సగటు ఫిల్మ్ ఫ్యాన్ కు సినిమా చూడాలనే ఆసక్తిని రేకెత్తించాయి. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజైన సమయంలో హను-మాన్ కూడా రిలీజైంది. అయితే ఆ సమయంలో ఆదిపురుష్ కన్నా హను-మాన్ ట్రైలర్ బాగుందని కితాబులు దక్కాయి.

    టీజర్, ట్రైలర్ లో ఇచ్చినట్టుగానే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి సూపర్ హీరో సినిమాలకు వయసు, వర్గ పరిమితి ఉండదు. తమ విస్తారమైన అనుభవంతో సంక్రాంతి సీజన్ లోనూ భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఈ సంక్రాంతి సీజన్ లో మహేశ్ బాబు గుంటూరు కారంతో తేజ సజ్జా హను-మాన్ ఢీ కొట్టబోతోంది. ఏ మూవీ హైప్ పెంచుతుందో చూడాలి మరి.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Haryana: హ‌రియానా లో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

    అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ...

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

      ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు...

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...

    Teja Sajja : దైవిక శక్తే మనలను నడిపిస్తుంది.. తేజ సజ్జా

    Teja Sajja : తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ మాగ్నమ్...