31.6 C
India
Sunday, May 19, 2024
More

    Bandla Ganesh CM Prediction : ఎవరు కాదన్నా ఆయనే తెలంగాణ సీఎం.. బండ్ల గణేశ్ జోస్యం..!

    Date:

    Bandla Ganesh CM Prediction
    Bandla Ganesh CM Prediction

    Bandla Ganesh CM Prediction : బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన మనసులో ఏదైనా చెప్పాలి అనుకుంటే దాన్ని కుండ బద్దలు కొట్టేసినట్టే చెబుతుంటాడు. ఇక తాజాగా ఆయన తెలంగాణ ఎన్నికల మీద సంచలన కామెంట్లు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా సరే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని.. రేవంత్ సీఎం అవుతారని ఆయన కామెంట్ చేశాడు.

    తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గత ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించాను. కానీ ఈ ఎన్నికల్లో నాకు ఎంతో ఇష్టమైన రేవంత్ రెడ్డి సీఎం బరిలో ఉన్నారు. కాబట్టి నాకు ఎలాంటి చాలా సంతోషంగా ఉంది. ఆరు నూరైనా సరే ఈ సారి ఆయనే సీఎం అవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్‌ పెరిగింది. అందులో ఎలాంటి అనుమానం లేదు.

    రేవంత్ రెడ్డి సీఎం అవుతారు. ఆయన సీఎం అయితే నేను అధికారం సొంతం చేసుకున్నట్టే. నేను ఇప్పటికే ప్రజా క్షేత్రంలో లక్ష మందితో మాట్లాడాను. వారందరూ కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నారు. ఆనందంతో నా రక్తం ఉప్పొంగుతుంది. కాంగ్రెస్ కార్యకర్తగా అది విని  నేను చాలా సంతోషిస్తున్నాను. నిజాలు, వాస్తవాలు, చేయబోయే సంక్షేమం గురించి చెప్పాం.

    ప్రజలు నమ్ముతున్నారు. జనం ఓట్లు వేయడానికి సిద్ధంగా వస్తున్నారు. గత పదేండ్లలో నిజంగానే సంక్షేమం చేసి ఉంటే ఇంట్లో ఉండి పార్టీని గెలిపించుకునే వారు. కానీ అలా కాకుండా రాష్ట్రం మొత్తం పరుగులు పెడుతున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతోంది. కానీ రేవంత్ ఒక్కడే కాంగ్రెస్ తరఫున బాహుబలిలా నిలబడ్డాడు. కాబట్టి కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అంటూ జోస్యం చెప్పారు బండ్ల గణేశ్.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...