PRC for TSRTC Employees : తెలంగాణ: టిఎస్ఆర్టిసి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్మెం ట్ తో పిఆర్సి ప్రకటించింది. జూన్ 1 2024 నుంచి ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి కలుగనుంది.
ఈ నిర్ణయంతో రూ.418.11కోట్ల సంస్థపై భారం పడుతుంది. ఎరియర్స్ పదవీ విరమణ పొందిన సమయంలో వడ్డీ లేకుండా చెల్లిస్తామని తెలిపిం ది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.
గత కొన్ని సంవత్సరాలుగా టిఎస్ఆర్టిసి ఉద్యోగు లు పిఆర్సి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత ప్రభుత్వం లో అది సాధ్యం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిఎస్ఆ ర్టిసి ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించి సంచల నిర్ణ యం తీసుకుంది.