30.1 C
India
Sunday, April 19, 2026
More

    కొత్త స‌చివాల‌యంపై కేసీఆర్ మార్క్..!

    Date:

    new-secretariat
    new-secretariat
      కేసీఆర్ ఏ ప‌ని చేసిన త‌న మార్క్ చూపించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. నూత‌న జిల్లాల ఏర్పాటు విష‌యంలోనూ ఇదే ప‌ద్ధ‌తిని అవ‌లంభించారు. తెలంగాణ‌లో ఇన్ని జిల్లాలెందుక‌ని ఎంత మంది విమ‌ర్శ‌లు చేసినా..ఆయ‌న మాత్రం అస్స‌లు విన‌లేదు. అలాగే కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ డిజైన్ మార్చ‌డంపై కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయిన‌ప్ప‌టికీ తాను అనుకున్న‌ట్లే డిజైన్‌ను రూపొందింప‌జేశారు.

    ఇక కేసీఆర్ కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని భావించిన‌ప్పుడు కూడా ఆయ‌న‌పై ఇలాంటి విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. ఇప్పుడున్న సెక్రెటేరియ‌ట్ వ‌ల్ల వ‌చ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్‌లాంటి వారైతే స‌చివాల‌యం అడుగున‌ నిజాం కాలం నాటి నేల‌మాలిగ‌లు ఉన్నాయ‌ని ఆరోపించారు. ప్ర‌కృతి సంప‌ద‌,చారిత్ర‌క క‌ట్ట‌డాల‌ను నాశ‌నం చేసేందుకే కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శించారు.

    అయితే ఈ విష‌యాలు వేటిని సీఎం కేసీఆర్ అస్స‌లు లెక్క‌నే చేయ‌లేదు. జిల్లాల ఏర్పాటు,కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన‌ట్లే అన్ని హంగుల‌తో కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని భావించారు. అందులో భాగంగానే మొద‌ట నూత‌న సెక్రెటేరియ‌ట్‌ను బైస‌న్ పోలో గ్రౌండ్‌లో నిర్మించాల‌ని అనుకున్నారు.కానీ,అది ర‌క్ష‌ణ శాఖ‌కు సంబంధించిన భూమి. దీంతో అక్క‌డ కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత ఎర్ర‌గ‌డ్డ‌లో క‌ట్టాల‌ని భావించారు.

    ఇక అక్క‌డ కూడా స‌చివాల‌య నిర్మాణానికి ప‌రిస్థితులు అనుకూలించ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన‌ప్పుడు ఏపీకి కేటాయించిన భ‌వంతుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు అప్ప‌గించింది. దీంతో వెంట‌నే వీటిని ప‌డ‌కొట్టి కేసీఆర్ తాను క‌ల‌లు క‌న్న ప‌ద్ధ‌తుల్లో నూత‌న స‌చివాల‌య నిర్మాణానికి రూప‌క‌ల్ప‌న చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TSRTC Employees : ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

    PRC for TSRTC Employees : తెలంగాణ: టిఎస్ఆర్టిసి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం...

    Shiva Balakrishna : ప్రభుత్వం చేతిలో బాలకృష్ణ అవినీతి ఆస్తుల చిట్టా..

    Shiva Balakrishna : హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)...

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Rythu Bandhu : రైతుబంధు అధికార పార్టీకి వరం కానుందా?

    Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇస్తోంది. రైతు...