Sleeping:
మనకు తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. అతిగా నిద్ర పోయినా నిద్ర లేకపోయినా ప్రమాదమే. ఈ నేపథ్యంలో నిద్ర గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొందరు నిద్రపట్టక ఇబ్బంది పడతారు. మరికొందరు అతిగా నిద్ర పోతుంటారు. రెండు మంచిది కాదు. మనిషి సగటున ఎంత సేపు నిద్ర పోవాలో అంతే సేపు నిద్రపోవాలి. లేదంటే మన ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం.
ఏ వయసు వారు ఎంత సమయం నిద్ర పోవాలో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లలు 14-17 గంటలు, ఏడాది లోపు వయసున్న వారు 12-15 గంటలు, 1-2 ఏళ్ల వయసున్న వారు 11-14 గంటలు, 3-5 ఏళ్ల వయసున్న వారు 10-13 గంటలు, స్కూలుకు వెళ్లే వారు 9-11 గంటలు, టీనేజర్లు 8-10 గంటలు, పెద్దలు 7-9 గంటలు, ముసలివారు 7-8 గంటలు నిద్ర పోవడం మంచిది.
అతినిద్ర అలవాటు ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు క్రమం తప్పకుండా ఒకే సమయానికి నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీలు తాగకూడదు. మధ్యాహ్నం సమయంలో నిద్రపోవద్దు. అలా చేస్తే రాత్రిళ్లు నిద్ర పట్టదు. దీంతో ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా నిద్ర లేవాల్సి వస్తుంది. వ్యాయామాలు చేయడం మంచిదే. కానీ అతిగా చేస్తే అవి నిద్రలేమికి దారి తీస్తాయి.
ఇలా మనం అతినిద్ర, నిద్ర లేమి నుంచి బయట పడటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే మన ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లేదంటే మనపై ప్రతికూల ప్రభావాలు చూపించొచ్చు. మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. నిద్రపోయే ముందు పాలు, పాల పదార్థాలు తీసుకోవద్దు. బాదం, కివి పండ్లు, చామొమైల్ టీ వంటివి కూడా దూరం పెట్టాలి. ఇలా మన నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.ఇలా అతి నిద్ర, నిద్ర లేమి సమస్యలను తొలగించుకుని ఆరోగ్యకరమైన జీవితం అనుభవించవచ్చు.