28 C
India
Friday, May 17, 2024
More

    Bandi Sanjay : అమెరికా లో బీజేపీ నాయకులు బండి సంజయ్‌ పర్యటన షెడ్యూల్ ఇదీ

    Date:

    bandi sanjay
    bandi sanjay

    Bandi Sanjay : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అమెరికా పర్యటిస్తున్నారు. పది రోజుల పాటు ఆయన యూఎస్‌లోనే ఉండనున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 1) తెల్లవారుజామున బండి సంజయ్ యూఎస్‌కు ప్రయాణమయ్యారు. శనివారం (సెప్టెంబర్ 2) అట్లాంటాలో జరిగే ఆప్తా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) 15వ వార్షికోత్సవంలో బీజేపీ ఎంపీ ప్రసంగించనున్నారు.

    ఆ తర్వాత వివిధ రాష్ట్రాలలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ (అఫ్-బీజేపీ ) ఆధ్వర్యంలో పబ్లిక్ మీటింగ్ జరుగబోతున్నట్లు అఫ్-బీజేపీ అధ్యక్షుడు అడపా ప్రసాద్ , అఫ్-బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి ఏనుగుల తెలిపారు.

    అందులో భాగముగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, లీడ్ వాలంటీర్ లు శ్రీనివాస్ కొంపల్లి, అరవింద్ మోదీని ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాలలో ఆరు పట్టణాలలో ఆత్మీయ సదస్సులు ( మీట్ అండ్ గ్రీట్ ) జరుపనున్నారు.

    సెప్టెంబర్ 3న అట్లాంటాలో , సెప్టెంబర్ 4న వివేక్ హాల్ (ఛార్లెట్) నార్త్ కారోలిన్ , సెప్టెంబర్ 5న సీసన్స్ @ తాండూర్ బంక్యూట్ హాల్ (ర్యాలీ) నార్త్ కెరోలినా , సెప్టెంబర్ 6న (ఫెయిర్ ఫాక్స్) వర్జీనియా, సెప్టెంబర్ 8న (హాలిడే ఇన్ హాజలెట్) న్యూ జెర్సీ , సెప్టెంబర్ 9న (ప్లేనో-డల్లాస్ ) టెక్సాస్ లో జరిగే ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ లో శ్రీ బండి సంజయ్ పాల్గొని, ప్రసంగించనున్నారు. పలు తెలుగు, తెలంగాణ ప్రవాస సంఘాలతో భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవా, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.అలాగే అమెరికా లోని వివిద నగరాలలో పూర్వ విద్యార్ది పరిషత్ నాయకులు, ముఖ్యంగా తెలంగాణా ఉద్యమకారులను ఎన్నారైలతో మాట్లాడుతారు. అమెరికా పర్యటనను ముగించుకుని సెప్టెంబర్ 10న ఆయన స్వదేశానికి తిరిగి రానున్నారు.

    వీరి పర్యటన కు వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నతెలుగు ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రవాస విద్యార్ది పరిషత్ పూర్వ విద్యార్దులు మరియు భారతీయ జనతా పార్టీ మిత్ర సంఘం కు చెందిన మిత్రులు వంశీ యంజాల, శ్రీనివాస్ నాతి , రాజు కుర్రపాటి, సుభాష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి యేలు , లష్మినారాయణ పెరి, సాయి సూదిని, అజయ్, శేఖర్ నల్లబోతుల, వినయ్, సంపత్, సుధాకర్, రఘు , వికాస్, కార్తికేయ, వికాస్, శ్యామసుందర్ , నికేత్ సాయిని, సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్ట , శ్రీకాంత్ తుమ్మల, రమేష్ కలవల, సంతోష్ వేముల, కృష్ణా గుడిపాటి, ఉపేన్ నందిపల్లి, ఓం నక్క , గోవింద్ రాజులూ , రఘు, విజయ్ కుందూరు శరత్ వేముల, గోపి సముద్రాల, రామ్ వేముల, కృష్ణా , శంకర్ రెడ్డి, ఆదిత్య , రామకృష్ణ జి వి స్,గోపి చిలుకూరు , శ్రీనివాస్ , శ్రీనివాస్ కొంపల్లి, అరవింద్ మోదీని, జంబుల విలాస్ రెడ్డి అమెరికా లో వివిధ నగరాలలో ఏర్పాట్లు చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ బరిలో ఈటల నిలుస్తారా?

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది....