32.6 C
India
Saturday, May 18, 2024
More

    Ramojirao : సాయం చేసినోడికే సున్నం.. రామోజీని ముంచుతున్న వారు వాళ్లే..

    Date:

    Ramojirao
    Ramojirao

    Ramojirao : రామోజీరావు అంటే తెలుగునాట ఒక వ్యాపారిగా మాత్రమే కాకుండా గతంలో రాజకీయాలు శాసించిన వ్యక్తిగా నిలిచిన వ్యక్తి. ఈనాడు, ఈటీవీ అనే అతి మీడియా సంస్థలతో పాటు రామోజీ ఫిలిం సిటీ అనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీంతో పాటు ప్రియా పచ్చళ్లు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ఉషా కిరణ్ మూవీస్, అన్నదాత పత్రిక ఇలా ఏదైనా రామోజీరావు ముట్టిందే బంగారమైంది. దీని వెనుక ఎందరో శ్రమ ఉండొచ్చు. కానీ మాస్టర్ బ్రెయిన్ రామోజీరావు దే అని చెప్పక తప్పదు. అలాంటి వ్యక్తి ఎన్నో కుటుంబాలకు అన్నం పెట్టాడు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది నిజం. తన సంస్థల నుంచి ఎంతో మంది ఉపాధి పొందారు. ఎన్నో కుటుంబాలకు కూడు, గూడు, గుడ్డ లభించాయి. రామోజీ రావు వ్యక్తిత్వం ఎలాంటి దైనా ఆయన స్థాపించిన ఈ సంస్థలే ఎందరికో నేటికీ అన్నం పెడుతున్నాయి.

    అయితే ఇప్పుడు రామెజీరావు విషయంలో ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం. ఆయనే లక్ష్యంగా ప్రస్తుతం సీఐడీ దాడులు కొనసాగుతున్నాయి. మార్గదర్శి టార్గెట్గా ఈనాడు సంస్థలను కూల్చివేసే ప్రయత్నానికి జగన్ పూనుకున్నారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసింది ఇదే. ఇప్పుడు ఆయన తనయుడు జగన్ చేస్తున్నది కూడా అదే. కోర్టుల్లో అక్షింతలు పడుతున్నా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. మార్గదర్శి సంస్థలు ఏదో జరుగుతుందంటూ హడావుడి చేస్తున్నది. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు లేకున్నా, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వ్యవహరిస్తున్నది. అయితే రామోజీరావు విషయంలో ఆయనను అప్రతిష్టపాలు చేయడమే ఇందులో లక్ష్యమనేది అందరికీ అర్థమవుతున్నది.

    అయితే రామోజీ రావు పై విష ప్రచారం చేయడంలో ఆయన ఉప్పు తిన్నవారు కూడా ఎందరో ఉన్నారు. ఈనాడు సంస్థలో తొలుత ఉఫాధి పొందిన ఎందరో వ్యక్తులు ఇప్పుడు ఆయన పై విష ప్రచారం మొదలు పెట్టారు. గతంలో ఈనాడులో ప్రమోషన్లు రాలేదనే కారణంతో బయటకు వెళ్లిన కొందరు ఇప్పుడు ఆయనపై విష ప్రచారం మొదలుపెట్టారు. ఈనాడు తమకు ఉపాధి నిచ్చిందని మరిచి ఇప్పుడు అన్నం పెట్టిన వ్యక్తిపైనే విష ప్రచారానికి దిగారు కొందరు. సోషల్ మీడియాలో ఈ విష ప్రచారం పెట్టిన వారిలో ఆయన సంస్థల్లో గతంలో పని చేసిన వారే ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Govt : రుణాల వేటలో ఏపీ ప్రభుత్వం – రూ. 4 వేల కోట్ల అప్పుకు యత్నం

    AP Govt : పదవీ కాలం ముగుస్తున్న దశలోనూ ఏపీ ప్రభుత్వం...

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్‌, వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు సీఐడీ షాక్!

    Sajjala Bhargav : ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో,...