Horoscope మేష రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. చేపట్టే పనుల్లో ప్రోత్సాహకాలు ఉంటాయి. పనులు త్వరగా పూర్తి చేస్తారు. వెంకటేశ్వరుడిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు. స
వృషభ రాశి వారికి మంచి కాలం. అన్ని పనుల్లో అనుకూలంగానే ఉంటోంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం వల్ల ఇంకా మంచి జరుగుతుంది.
మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీదేవిని కొలిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారికి ఉద్యోగులకు శుభ ఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలంతో పనులు చక్కబెడతారు. ఇష్టదైవాన్ని దర్శించడం వల్ల మంచిది.
సింహ రాశి వారికి అనుకూల కాలం. పనుల్లో ఆలస్యం వద్దు. మనోనిబ్బరంతో ముందుకు సాగండి. గోసేవ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
కన్య రాశి వారికి స్తిరాస్తి కొనుగోళ్లు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసిక ప్రశాంతత ఉంటుంది. విష్ణు ఆలయ దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
తుల రాశి వారికి చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశముంది. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి వారికి మంచి కాలం. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. ఆంజనేయుడిని దర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ధనస్సు రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. దుర్గాదేవి ధ్యానం వల్ల మంచి ఫలితాలు కలగనున్నాయి.
మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళతారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. లక్ష్మీగణపతి ఆరాధన చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.
కుంభ రాశి వారికి చేపట్టే పనుల్లో పెద్దల సలహాలు తీసుకుంటే మేలు. కీలక పనులు పూర్తి చేస్తారు. విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తే మంచిది.
మీన రాశి వారికి విజయానికి దగ్గర దారులు దొరుకుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది.