
Laddu counters : వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినా అంచాలకు మించి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. ఈ నేపథ్యంలో భక్తులకు కష్టాలు తప్పడం లేదు. అనుకున్న విధంగా స్వామి దర్శనం దక్కడం లేదు. గంటల కొద్ది లైన్లలో నిలబడాల్సి వస్తోంది. దీని వల్ల ఎన్నో తిప్పలు పడుతున్నారు. దీనికి టీటీడీ అధికార యంత్రాంగం సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
తిరుమలలో సర్వదర్శనానికి వచ్చే భక్తులతో క్యూ కాంప్లెక్స్ సందడిగా మారాయి. సర్వ దర్శనానికి దాదాపు 24 గంటలు పడుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గురువారం 67 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు వచ్చినట్లు తెలిపింది. దాదాపు 33 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు చందనంతో అభిషేకం చేశారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ వీధులన్ని నిండిపోయాయి. లడ్డుల విక్రయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ఇదివరకే 30 ఉండగా మిగతా వాటిని కూడా నిర్వహించాలని చూస్తోంది.
ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విదేశీ కరెన్సీని కూడా మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. పరకమణిలో ఉన్న పాడైన నోట్లను జాప్యం లేకుండా తరలించే చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో పలు తీర్మాణాలు ఆమోదించారు. దీంతో ఇక మీదట తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేదే వారి ఉద్దేశంగా కనిపిస్తోంది.