
Venkaiah Naidu Funny Comments on Swiggy and Zomato : సందేశాత్మక ప్రసంగానికి హ్యూమరస్ ను జోడించడం వెంకయ్యనాయుడికే చెల్లుతుంది. ఆయన ఓ మాటల మాంత్రికుడు.. ఏ అంశానైనా అవలీలగా మాట్లాడడం ఆయనకే సొంతం. ప్రాసలకే దడ పుట్టించడంలో ఆయన దిట్ట. గతంలో రాష్ట్రపతి పదివికి వెంకయ్యనాయుడు ఎన్నికవుతాడన్న వార్తలు వ్యాప్తిస్తున్న నేపథ్యలో ఆయన ఒక సభలో ప్రసంగించారు. తనకు ఎలాంటి రాష్ట్రపతి పదవి వద్దని తాను ఎన్నటికీ ఉమాపతి (వెంకయ్య నాయుడు భార్య పేరు)నే అంటూ హ్యూమరస్ గా తానకు ఆ పదవి ఇష్టం లేదని చెప్కకనే చెప్పారు. ఆయన ఇలాంటి ప్రసంగాలన్నీ కలిసి రెండు వ్యాల్యూమ్స్ గా అచ్చు వేయించారు.
ఆయన ప్రసంగాలంటేనే ఇటు యువత నుంచి అటు వృద్ధుల వరకూ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఆయన ఒక సమావేశంలో పాల్గొని స్విగ్గీ, జొమాటోపై సెటైర్లు వేశారు. ఈ కామెంట్లతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ మంచి భోజనం తింటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకచ్చారు. మంచి ఆహారపు అలవాట్లతో దీర్ఘాయుష్షు కలుగుతుందన్నారు. . మంచి భోజనం అంటే నాయుడు గారు ఏమన్నా స్పెషల్ గా సూచిస్తారా అనుకుంటే పొరబాటే వండిన పదార్థాలను తినాలని సూచించారు.
వంట మరిచిపోతే.. జంట విడిపోతుంది..
ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఆన్ లైన్ యాప్ లలో ఫుడ్ ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటున్నారు. వంట మరిచిపోతే జంట విడిపోతుందని ‘వంట పోతే జంట విడిపోతుంది’ అంటూ చెప్పారు. వంట భార్య అయినా భర్త అయినా ఎవరైనా చేయచ్చుకానీ వంట గది అనేది ఇంటిలో ఇంపార్టెంట్ అక్కడే ఆరోగ్య కరమైన రుచులతో పాటు భార్యా భర్తల మధ్య అన్యూన్యత పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అక్కడే కూర్చొని తింటూ మాట్లాడుకుంటారన్నారు. ఇన్ స్టంట్ ఫుడ్ తింటే కాన్‌స్టెంట్ డిసీజెన్ వస్తాయని చెప్పారు వెంకయ్య నాయుడు. 25 ఇయర్స్ కూడా లేకుండా చికెక్-65 కావాలని ఆర్డర్ పెడతాడు. అంటే తొందరగా 65కి పోవాలని ఆశ కలుగుతుందన్నట్లు చెప్పారు.
నాటుకోడి పులుసు, రాగి సంకటి, పాత చింతకాయ పచ్చడి లాంటి ఫుడ్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఆ రుచులే వేరని, నాలుకపై పడితే మంచి మజా వస్తుందన్నారు. మన కూరలు, వంటలు వేల ఏళ్ల నుంచి సాంప్రదాయంగా మనకు వస్తున్నాయన్నారు. వారసత్వ సంపద అంటూ చెప్పుకచ్చారు వెంకయ్యనాయుడు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అందరూ కూడా వారసత్వ సంపద, దేశ కీర్తి ప్రతిష్టతను ముందకు తీసుకెళ్లాలని అన్నారు.
మన కడుపు, మన బొట్టు, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస కూడా. అతి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఏదైనా ఒక్కటే అన్నారు. ఎప్పుడు వెంకయ్య నాయుడు మాట్లాడినా ఈలలు, గోలలు కామన్. ఆయన ప్రసంగంలో కంటెంట్ తో పాటు ప్రాసలు బాగా ఉంటాయి. ఏది ఏమైనా వెంకయ్యనాయుడి ప్రసంగంపై సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.