Ram Charan-Ranveer Singh-Deepika Combo :
గత ఏడేళ్లల్లో మన టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగింది. టాలీవుడ్ హీరోలతో కలిసి బాలీవుడ్ హీరోలు సినిమాలు చేయడానికి నో చెప్పక పోగా ఇంకా ఆసక్తి చూపించడం విశేషం.. దీంతో టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. దీంతో మేకర్స్ కూడా క్రేజీ కాంబోలు సెట్ చేస్తున్నారు.. ఇప్పటికే వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు సడెన్ గా ఒక సంచలన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ వీడియోను స్వయంగా రణవీర్ సింగ్ పోస్ట్ చేసాడు.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ వీడియోలో రామ్ చరణ్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనె, స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఉంది.. ఇందులో దీపికా పోలీస్ స్టేషన్ లో తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసినట్టు కనిపిస్తుంది..
ఆ తర్వాత రణవీర్ సింగ్, రామ్ చరణ్ కూడా ఈ వీడియోలో కనిపించారు. చరణ్ ఎవరినో ఛేజ్ చేస్తూ వేగంగా పరిగెత్తడం చూడొచ్చు.. ఆ తర్వాత ఈ వీడియోలో త్రిష కూడా కనిపించింది.. మరి ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా పెద్ద మూవీ చేయబోతున్నారా అనే అనుమానాలు ప్రేక్షకుల నుండి వస్తున్నాయి.. కానీ ఇది మూవీ కోసం కాదట..
ఇది అంత ఒక పెద్ద యాడ్ షూట్ కోసం అని తెలుస్తుంది. త్వరలోనే ఈ యాడ్ షూట్ కంప్లీట్ అవుతుందని ఆ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.. ఇది యాడ్ అని తెలుసుకున్న ప్రేక్షకుల ఆశ్చర్య పోతున్నారు.. ఒక యాడ్ కోసం ఇంత మంది భారీ తారాగణాన్ని తీసుకోవడం రికార్డ్ అని చెప్పాలి.. చూడాలి మరి ఈ యాడ్ ఎలా ఉంటుందో..