27.9 C
India
Thursday, September 10, 2026
More

    IPL franchises : భవిష్యత్ లో ఫ్రాంచైజీల అనుమతి తీసుకోవాలేమో.?

    Date:

    • ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్

      IPL franchises
      IPL franchises, pat cummins 
    IPL franchises : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. WTC రెండో ఎడిషన్ ఫైనల్ జూన్ 7న లండన్‌లోని ఓవల్‌లో జరగనుంది. అయితే  ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ పై షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.  ఐపీఎల్‌ క్రికెట్‌లో ఎన్నో మార్పులకు దారి తీసిందన్నారు.  పదేళ్ల క్రితమే ఐపీఎల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ రూపురేఖలను మార్చివేసిందన్నారు.   ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్‌ గుత్తాధిపత్యానికి ఐపీఎల్‌ చెక్ పెట్టిందని చెప్పారు. జాతీయ జట్టుకు ప్రాధాన్యమిచ్చేలా ప్లేయర్లను ఒప్పించడం సవాల్‌గా మారనుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీ20 లీగ్‌ల కారణంగానే న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కూడా ట్రెంట్‌ బౌల్ట్‌ వద్దన్నాడని కమిన్స్‌ వెల్లడించారు.

    ‘ఒకప్పటిలా ఇప్పుడు ఆటగాళ్ల సమయంపై అంతర్జాతీయ క్రికెట్‌కు గుత్తాధిపత్యం లేదు. పదేళ్ల క్రితమే ఐపీఎల్‌ దీనిని మార్చివేసింది. ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలి. మా టీం క్రికెటర్లు ఇతర విషయాలకంటే జాతీయ జట్టుకే ప్రాధాన్యమివ్వాలని కోరుకుంటున్నానని  అయితే, ఎక్కువ లాభం చేకూర్చే ఫ్రాంఛైజీ లీగ్‌ల కారణంగా ఇది సవాల్ తో కూడుకున్న అంశమని కమిన్స్‌ పేర్కొన్నాడు.

    ‘ఆస్ట్రేలియా తరఫున ఆడటం ప్రత్యేకం. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా జాతీయ జట్టుకు ఆడాలి. మంచి ప్రదర్శన ఇవ్వాలి. దీని గురించి మనం మరింత డెప్త్ గా ఆలోచించాలి. భవిష్యత్లో అంతర్జాతీయ క్యాలెండర్‌ లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌ కూడా సాకర్‌ మార్గంలోనే వెళ్తున్నదని, జాతీయ జట్టుకు ఆడేందుకు బహుశా  ఫ్రాంఛైజీల నుంచి అనుమతులు తీసుకోవాల్సి వస్తుందేమోనని అనుమానాలు వ్యక్తం చేశాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Border-Gavaskar Trophy : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..

    Border-Gavaskar Trophy : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్...

    Australia : ఆస్ట్రేలియాలో చదువు ఆపేసి టీ బిజినెస్.. ఏడాదికి రూ.5.2 కోట్లు ఆదాయం

    Australia Tea Business : ఏపీలోని నెల్లూరుకు చెందిన సంజిత్ కొండ...

    Australia : ఆస్ట్రేలియాతో ఎంపికైన టెస్టు జట్టు ఇదే

    Australia : ఆస్ట్రేలియా వెళ్లనున్న టీంలో సర్పరాజ్ ఖాన్ చోటు  దక్కించుకున్నాడు....

    IPL Retentions: ఐపీఎల్ లో ఆటగాళ్ల రిటెన్షన్ విధానానికి 75 కోట్లు?

      IPL Retentions: ఐపీఎల్ లో ప్లేయర్లను రిటెన్షన్ చేసుకునే విధానం ద్వారా...