30.5 C
India
Friday, May 3, 2024
More

    Delhi Capitals : ఎట్టకేలకు విజయాల బాట పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్

    Date:

    Delhi Capitals
    Delhi Capitals

    Delhi Capitals : ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తో శుక్రవారం లక్నో లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ ఆల్ రౌండ్ ప్రదర్శ నతో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం లక్నో జట్టు సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో  హోం గ్రౌండ్ ఆటగాళ్లు బ్యాట్ తో తడబడ్డారు. స్టార్ ఆటగాళ్లతో దుర్భేధ్యంగా ఉన్నా లక్నో బ్యాటింగ్ లైనఫ్ ను కుల్దీప్ యాదవ్ కకావికలం చేశాడు.

    వరుస బంతుల్లో పూరన్‌, రాహుల్ లను ఔట్ చేసిన కుల్ దీప్ యాదవ్ మొత్తం మూడు వికెట్లతో లక్నో వెన్ను విరిచాడు.  దీంతో 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిపోయింది. ఈ సమయంలో లక్నో యువ సంచలనం ఆయుష్ బదోని, 35 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఆయుష్ బదోనికి అర్షద్ ఖాన్ (20) సహకారం అందించడంతో 73 పరుగుల భాగస్వామ్యంతో 20 ఓవర్లకు  167/7 స్కోరు చేయగలిగింది.

    అనంతరం రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వార్నర్ వికెట్ ను ఎర్లీగా నే కోల్పోయింది.  8 పరుగులకే వార్నర్ వెనుదిరగ్గా.. ఓపెనర్ పృథ్వీ షా, వన్ డౌన్ లో వచ్చిన ఐపీఎల్ డెబ్యూ బ్యాటర్ జేమ్స్ ఫ్రసెర్ ముగుర్క్ అయిదు సిక్సులు, రెండు ఫోర్లతో  55 పరుగులతో చెలరేగగా, పంత్ (41) పరుగులతో సహకరమందించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు సునాయాసమైంది. చివర్లో పంత్, జేమ్స్ ఫ్రసెర్ అవుటైనా.. ట్రిస్టన్ స్ట్రబ్స్, షై హోప్ ఢిల్లీ విజయాన్ని పరిపూర్ణం చేశారు.

    దీంతో వరుస ఓటములతో సతమతవవుతూ పాయింట్స్ టేబుల్స్ లో చివరలో ఉన్నా ఢిల్లీకి ఈ విజయం ఊరటనిచ్చింది. బ్యాటింగ్ లో పంత్ ఫామ్ లోకి రావడం, కొత్త బ్యాటర్ లయ అందుకోవడం, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం ఢిల్లీకి సానుకూల అంశాలు. రాబోయే మ్యాచ్ ల్లో పాజిటివ్ ఎనర్జీతో పోరాడేందుకు ఈ గెలుపుకు వారికెంతో ఉపయోగపడుతుంది.  ఈ విజయంతో ఒక స్థానం ఎగబాకిన ఢిల్లీ పాయింట్స్ టేబుల్ లో తొమ్మిదో స్థానానికి చేరుకుంది.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    CSK Vs PBSK : చెపాక్ లో ఆధిపత్యం ఎవరిది?

    CSK Vs PBSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 49వ...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...