25.8 C
India
Monday, July 1, 2024
More

    Jamili Elections : జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

    Date:

    Jamili Elections :
    కేంద్రం ఈ సారి జమిలి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఇదే విషయంపై భిన్నమైన వార్తా కథనాలు వస్తున్నాయి. దీనికి తోడు కేంద్రం కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. దీంతో జమిలి ఎన్నికల ఎత్తుగడ ఫలిస్తుందా? లేదా అనేది సందేహంగా మారింది. కానీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి లాభం కలుగుతుంది? ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయనే దానిపై స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
    జమిలి ఎన్నికలు జరిగితే మొదట మన ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుంది. జమిలి ఎన్నికలతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఖర్చు కలిసొస్తుంది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఎన్నికలు ఒకేసారి జరిగితే సమయం కూడా ఆదా అవుతుంది. ఇంతకు ముందు కూడా జమిలి ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే పాలసీని కొనసాగించాలని కేంద్రం చూస్తోంది.
    జస్టిస్ బి.పి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో లా కమిషన్ 1999లో ఎన్నికల చట్టాలపై 170వ నివేదికలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. 2015 డిసెంబర్ లో న్యాయశాఖ పార్లమెంరీ స్థాయి సంఘం 79వ నివేదికలో దీని గురించి ప్రస్తావించారు. 2017 నవంబర్ లో నీతి ఆయోగ్ సభ్యుడు, ఓఎస్ డీ వివేక్ ఒబెరాయ్, కిషోర్ దేశాయ్ కూడా జమిలి ఎన్నికలపై నీతి ఆయోగ్ తరఫున విశ్లేషించారు.
    జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతం చాలా రాష్ట్రాల అసెంబ్లీ గడువు ఇంకా తీరలేదు. దీంతో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువు తగ్గించడమో పెంచడమో చేయాలి. లోక్ సభ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగ పరంగా అవరోధాలున్నాయి.
    లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది. ఇలా ఒకేసారి నిర్వహించే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం వంద శాతం, అసెంబ్లీలు 50 శాతం భరించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల భారాన్ని వంద శాతం భరించాల్సి ఉంటుంది. ఇలా జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని విధాలా మేలు కలుగుతుంది.

    Share post:

    More like this
    Related

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jamili Elections 2029 : 2029 మే, జూన్ నెల మధ్య దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు

    Jamili Elections 2029 : 2029 మే, జూన్ నెల మధ్య...

    Jamili Elections : వచ్చేది జమిలి ఎన్నికలే.. లా కమిషన్ నివేదిక నేడే..

    Jamili Elections : దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రంలోని నరేంద్రమోదీ...

    Jamili Elections : కేంద్రం ఆదేశిస్తే.. జగన్ ముందస్తుకు వెళ్లాల్సిందేనా.. ?

    Jamili Elections : కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లానుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి....

    Jamili Elections : జమిలి ఎన్నికలకు కమిటీ.. సౌత్ కు దక్కని చోటు

    Jamili Elections : కొంతకాలంగా దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై విస్తృతంగా చర్చ...