36.9 C
India
Sunday, May 19, 2024
More

    TDP Contests in Telangana : తెలంగాణలో టీడీపీ పోటీతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    Date:

    TDP Contests in Telangana
    TDP Contests in Telangana

    TDP Contests in Telangana : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వేగంగా సమరానికి సిద్ధం అవుతున్నాయి. ఇంకా ఇక్కడ మరో ప్రధాన పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం అభ్యర్థులనే ప్రకటించలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైలులో ఉండడం, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా పలు కారణాలతో అందుబాటులో లేకపోవడంతో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్న కాసాని అభ్యర్థుల లిస్ట్ కూడా ఖరారైందని చెప్తున్నారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును ములాకత్ అయిన తర్వాత ఆయన అనుమతితో రిలీజ్ చేస్తామని చెప్తున్నాడు.

    ‘ఇప్పటి వరకు కనీసం అభ్యర్థుల వివరాలు కూడా ప్రకటించని టీడీపీ తెలంగాణలో పోటీ చేయదని’ సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించాయి. వీటిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని కొట్టి పారేశారు. తెలంగాణలో పోటీ చేస్తామని, ఇప్పటికి 87 స్థానాల్లో అభ్యర్థులు రెడీగా ఉన్నారని, 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల దరఖాస్తులు తమ వద్ద ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయ చెప్పుకచ్చారు.

    తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే ఏ పార్టీకి కలిసి వస్తుంది. ఏ పార్టీ ఇబ్బందుల్లో పడుతుందన్న దానిపై రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పోటీ చేయవద్దని బీజేపీ బలంగా కోరుకుంటుందని వారు అంటున్నారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు చీలిపోయి తమకు ప్రమాదం జరుగుతుందని బీజేపీ భావిస్తుంది. ఏపీలో వైసీపీకి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపునకు వెళ్లే ప్రసక్తే లేదు. ఇక కేటీఆర్ అన్న మాటలు కూడా కొంత ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో టీడీపీ పోటీ చేయకుండా ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపునకు మళ్లే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. ఏది ఏమైనా బీజేపీకి రెండు విధాలుగా నష్టమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pulivarthi Nani : దొంగ ఓట్లపై ఉద్యమాన్ని ఉదృతం చేసిన టీడీపీ నేత పులివర్తి నాని

    పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం.. Pulivarthi Nani : రాష్ట్రంలో అనేక చోట్ల...

    Chandra Babu : కుటుంబమంతా ప్రజాక్షేత్రంలోకి.. దూకుడు పెంచిన టీడీపీ అధినేత

    Chandra Babu : ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది. అన్ని పార్టీలు...

    Teenmar Mallanna To Congress : కాంగ్రెస్ లోకి తీన్మార్ మల్లన్న.. టికెట్ కేటాయింపుపై సస్పెన్స్..

    Teenmar Mallanna To Congress : మార్నింగ్ న్యూస్ తో కల్వకుంట్ల...