Mallareddy Comments :
భారత రాష్ట్ర సమితి మంత్రి మల్లారెడ్డి క్రేజ్ ఉన్న నేత. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్స్ తో చాలా గడించాడు ఆయన. ఆయన కొడుకు కూడా వీటితో కోట్లాది రూపాయలను వెనకేసుకున్నారు. గతంలో ఆయన ఇంటితో పాటు కలేజీలపై ఈడీ రైడ్స్ కూడా చేసింది. ఆ సమయంలో రాష్ట్రం మొత్తం తీవ్రంగా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో కూడా మల్లన్న (మల్లారెడ్డి)కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఒక విలేకరితో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఆయన అన్న మాటలను ఒక సందర్భంలో స్టేజీపై చెప్పడం విశేషం.
మల్లారెడ్డికి ఇంజినీరింగ్ తో పాటు వివిధ విభాగాల్లో చాలా కాలేజీలు ఉన్నాయి. చిన్న తనం నుంచి తాను కష్టపడుతూ ఎదిగానని చెప్పిన ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా లేకపోలేదు. ఆయన ఒక సంచలన విషయం చెప్పారు. తానే రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి డబ్బులు ఇచ్చానని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్విటర్ వేదికగా చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో పాటు ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు.
మంత్రి మల్లారెడ్డికి, రేవంత్ రెడ్డికి పొలిటికల్ అనే వృక్షానికి రెండు కొమ్ములు. వారి వారి నియోజకవర్గాలు కూడా దగ్గర దగ్గరగా ఉండడంతో ఒకరికొకరు మంచి స్నేహితులని బాహాటంగానే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి తను ఖర్చు చేశారని సంచలన విషయాలు చెప్పారు మంత్రి మల్లారెడ్డి. మల్లన్న మాట్లాడుతూ ‘వాడిని (రేవంత్ రెడ్డి) యాదగిరి గుట్టమీద ఉట్టేసి అడుగుండ్రి వాని బిడ్డ పెళ్లి ఎవరి పైసలతోని చేసిండు.. మల్లారెడ్డి పైసలతోని వాన్ని అడుగుర్రి.. నేనన్నా ఒట్టు తింటా.. వాన్నన్నా ఒట్టు తినుమను.. అబద్దమైతే అంత దుర్మార్గం.’ అన్నాడు. ఇప్పుడు ట్విటర్ వేదికగా ఆయన మాటలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందిచలేదు.
https://twitter.com/Gowtham_Goud6/status/1680797168612028417?t=mtYnwhfm1SpNRxd5zr-MyQ&s=08