36.9 C
India
Sunday, May 19, 2024
More

    భానుమతి ముందు చొక్కా విప్పాల్సిందే..! దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎన్టీఆర్

    Date:

    bhanumathi
    bhanumathi

    ఎంత కాదన్నా క్లాసిక్ మూవీస్ మదిని విడిచిపెట్టవు. బ్లాక్ అండ్ వైట్ కాలం సినిమాల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటాయి. అప్పటి డైరెక్టర్లు అంత మంచి క్లాసిక్ లను మనకు అప్పగించారు. అలాంటి సినిమాకు సంబంధించి ఒక విషయం ఇక్కడ చర్చించుకుందాం.

    భానుమతి గురించి అప్పటి నటులకు బాగా తెలుసు, ఇప్పటి వారిలో కొందరికి కొంత మేరకే తెలుసు. ఆమె పట్టుబట్టిందా అది జరిగితీరాలి. దేనికీ కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. సగం వరకు చేసిన సినిమాలు కూడా ఆమె మూలంగా పూర్తవలేదంటే సందేహం లేదు. దీంతో పాటు సూర్యకాంతం లాంటి నటులను ఇండస్ట్రీకి తీసుకువచ్చింది భానుమతే. చాలా మంది నటులను తన బ్యానర్ లో పరిచయం చేశారు ఆమె.

    అసలు కథ విషయానికి వస్తే ‘విప్రనారాయణ’ సినిమా చేయాలని అనుకున్నారు భానుమతి-రామకృష్ణ. ఆ సినిమాలో నటించాలంటే సినిమా మొత్తం చొక్కా లేకుండా పిలకతో ఉండాలి. ఈ సినిమా కథను తన ఫెవరేట్ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ కు వివరించారు భానుమతి. అన్నగారు అంతా విని స్టోరీ బాగుంది తీద్దాం అన్నారు. కానీ సినిమా మొత్తం చొక్కా ఉండద్దని భానుమతి చెప్పడంతో ఇది కుదరదని చెప్పాడు. ఇక చేసేది లేక అప్పటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వర్ రావును కూడా కలిసిందట భానుమతి. ఆయన కూడా చొక్కా లేకుండా నటించడం కుదరదని చెప్పాడు. దీంతో రామకృష్ణ కల్పించుకొని చొక్కా వేద్దాం అన్నారట. చొక్కా ఎట్టి పరిస్థితుల్లో వేసేది లేదు. హీరో కోసం సంస్కృతిని పాడు చేయడం ఇష్టం లేదని చెప్పింది భానుమతి.

    ‘విప్రనారాయణ’ కథ తమిళనాడు బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో చొక్కా ఉండకూడదని చెప్పిందట. సినిమా కూడా చాలా రోజులు ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది. ఏమైందో తెలియదుకానీ ఒక రోజు అక్కినేని ఫోన్ చేసి తాను చేస్తానని చెప్పడంతో ప్రాజెక్ట్ దిగ్విజయంగా పూర్తయింది. అయితే ఇందులో వేశ్య పాత్రలో భానుమతి నటించగా, రంగనాథుడి భక్తుడి పాత్రలో అక్కినేని నటించారు. నాగేశ్వర్ రావుకు చొక్కా లేకుండా సినిమా మొత్తం పూర్తయింది. ఈ సినిమా వచ్చిన సమయంలో అక్కినేని స్టార్ హీరో. అమ్మాయిలు ఆయన కోసం పడి చచ్చేవారు. అలాంటి వ్యక్తి చొక్కా లేకుండా ఇలాంటి సినిమా తీయడం ఆశ్చర్యం కలిగించిందని అప్పట్లో చాలా మంది కామెంట్లు చేశారు.

    ఇక విప్రనారాయణ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒక్క విజయవాడలోనే ఏడాది పాటు ఆడింది. దీంతో అక్కడ రోజంతా భోజనాలు పెట్టారు. తమిళనాట శ్రీరంగంలో కూడా విజయం సాధించింది. అక్కడ కూడా భోజనాలు పెట్టారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    CM Jagan : కలకలం రేపిన జగన్ పై దాడి

    CM Jagan : సిఎం జగన్ పై నిన్న జరిగిన రాయి...