కరోనా కల్లోలం మళ్ళీ మొదలైంది. చైనాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కరోనా కేసులు నమోదు అవుతుండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టుల్లో కరోనా టెస్ట్ లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో డిసెంబర్ 22 నుండి అన్ని ఎయిర్ పోర్టుల్లో కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. అలాగే నమూనాలను జినోమ్ సెక్వెన్సింగ్ కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎయిర్ పోర్టుల్లోనే కాకుండా ప్రయాణీకులు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్రం సూచించింది. అలాగే రద్దీ ప్రాంతాల్లో తిరిగే ప్రజలు కూడా మాస్క్ ధరించాలని అలాగే జలుబు , దగ్గు ఉన్నవాళ్లు వెంటనే కోవిడ్ – 19 టెస్ట్ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి మళ్ళీ తరుముకొస్తున్నప్పటికీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని , జాగ్రత్తలు తీసుకోవాలని అంటోంది కేంద్రం.