Corona Cases : దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుదలకు కారణమైన జెఎన్.1 వేరియంట్ కేసులను భారత్ లోని రాష్ట్రాల్లో గుర్తించారు. సోమవారం నమోదైన 636 కేసులతో కలిపి దేశంలో కరోనా మొత్తం ఆక్టివ్ కేసులు సంఖ్య 4,394కు చేరుకుందని అధికారులు తెలిపారు.
గుజరాత్ కేరళ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గోవా ఇలా పలు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. వరుసగా పెరుగుతున్న కేసులతో కేంద్ర ప్రభుత్వం అప్రమ త్తమైంది. కొత్త కేసులను నిశితంగా గమనిస్తుంది. టెస్టుల సంఖ్య పెంచాలని ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సకు ప్రత్యేక బెడ్లను సిద్ధం చేయాలని అవసరమైన వారికి వ్యాక్సిన్లు అందించాలని రాష్ట్రాలకు సూచించింది.
వీరు జాగ్రత్తగా ఉండాలి :
ముఖ్యంగా వృద్ధులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చిన్న పిల్లలు దీర్ఘకాలిక రోగాలు తో బాధపడుతున్న వారు గర్భిణీలు ఈ వైరస్ వేగంగా సోకే అవకాశం ఉందన్నారు. వీళ్ళు తగిన జాగ్రత్త లు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ సోకినా అంత భయపడా ల్సిన అవసరం లేదని వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.