
Central Budget 2024 : కేంద్ర బడ్జెట్ పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ పై అందరికి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎవరికి తాయిలాలు ప్రకటిస్తారు? ఎవరికి పన్ను విధిస్తారు? అనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో బీజేపీ బడ్జెట్ ను ప్రత్యేకంగా తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లు చెబుతున్నారు. ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రించాలనే విషయాల మీదే చర్చలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ లో వీటి లభ్యత కోసం పలు చర్యలు తీసుకునే అవకాశముంది. సామాన్యులకు మేలు కలగాలనే ఉద్దేశంతో కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక ద్రవ్యలోటు లక్ష్యాన్ని 50.7 పాయింట్ల వద్ద ఉండేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 90.7 లక్షల కోట్ల మేర తగ్గించుకోవాలని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ఉపాధి గ్రుహ నిర్మాణాలపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈ మేరకు నిర్ణయాలపై కొంత సందిగ్ధం ఏర్పడనుందని చెబుతున్నారు.
2024-25 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టే బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఉండేలా చూసుకుంటున్నారు. ప్రజల ఆమోదం పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై బడ్జెట్ రూపకల్పన ఎలా ఉండాలనేదానిపై పలువురు చెబుతున్నారు.