24 C
India
Saturday, September 12, 2026
More

    Merciless Monsoon : కనికరించని రుతుపవనం.. కానరాని వానజాడ

    Date:

    Merciless Monsoon : రుతుపవనాలు వచ్చినా వానలు పడడం లేదు. వడగాలుల తీవ్రత పెరిగి, జనం అల్లాడుతున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ రెండో వారం దాటినా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజుల్లో రాయలసీమ.. దక్షిణ కోస్తాల్లో మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి. అయితే నాలుగైదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నది.
    ఈసారి తుఫాన్ల కారణంగా రుతుపవనాలు బలపడడం లేదు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా ఏర్పడి తీరం తాకింది. ఈ తుఫాన్ నైరుతి పై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా రుతుపవనాల ప్రవేశం తరువాత వర్షాలు ఆరంభం అవుతాయి. ఈ సారి మాత్రం వాతావరణంలో భిన్న మార్పులు కనిపిస్తున్నాయి.
    ఈ సారి జూన్ నెలాఖరు వరకు ఎండలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సారి సుదీర్ఘ వేసవి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 19 నుంచి 23వ తేదీ మధ్య రుతుపవనాలు విస్తరించనున్నాయి. దీంతో 19వ తేదీ తరువాత పలు ప్రాంతాల్లో రుతుపవన వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
     వడగాల్పుల తీవ్రత:తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో పాటు వడగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 19 వరకు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
    ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. వాయువ్య దిశ నుంచి వీచిన పొడిగాలులతో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోనూ భారీ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. 210 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..220 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
    రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల తీవ్ర వడగాల్పులు.. అనేక చెట్ల గాడ్పులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 23 మధ్య ఉత్తర కోస్తాకు రుతువపనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో.. మరో మూడు రోజుల పాటు ఇదే విధంగా వడగాలుల తీవ్రత కొనసాగనుందని భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Monsoon : ఏపీలోకి రుతుపవనాల ఎంట్రీ – నాలుగు రోజుల వానలు

    Monsoon in AP : ఏపీలో చల్లటి వాతావరణానికి బాట పడుతోంది. నైరుతి...

    Monsoon : తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల రాక అప్పుడేనా..!

    Monsoon :  తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు...

    Monsoon Report : తెలుగు రాష్ట్రాలు మరిన్ని రోజులు ఆగాల్సిందే.. నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ క్లారిటీ

    Monsoon Report : రోహిణి కార్తె కొనసాగుతోంది. అందుకే సూర్యుడు తన...