Monsoon : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు మండుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజానీకం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది మరో రెండు రోజులపాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది.
ఏపీ తెలంగాణలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా కొనసాగుతుందని పేర్కొంది. ఏపీలో గురువారం 15 మండలాల్లో, శుక్రవారం మరికొన్ని మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. తెలంగాణలో మాత్రం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయతాయని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే నమోదు అవుతున్నాయి. ప్రస్తుతమున్న మిక్స్ డ్ వెదర్ తో ఆరోగ్యపరంగా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు
అయితే రుతుపవనాల రాకను వాతావరణ శాఖ నిత్యం గమనిస్తూనే ఉంది. ఒకటి, రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని ఆ తర్వాత అల్పపీడనం బలపడి తుఫాను మారితే రుతు పవనాల విస్తరణ ప్రభావం చూపుతుందని తెలిపింది. జూన్ 8 9 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అక్కడి నుంచి విస్తరిస్తాయని తెలిపింది. గతేడాదితో పోలిస్తే రుతుపవనాల రాక వారం ఆలస్యం అవుతున్నదని తెలిపింది. అయితే రుతుపవనాల రాక పై వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో తగిన కార్యాచరణకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతున్నది. సాగుకు రైతులను కూడా అప్రమత్తం చేయనుంది. ఈ ఏడాది భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అందుకు అనుగుణంగా పంటలు వేయించాలని భావిస్తున్నది.
ReplyForward
|