కరోనా మహమ్మారి వాళ్ళని వీళ్ళని అని కాకుండా అందరిని ఓ ఆట ఆడుకుంటోంది. కరోనా జాబితాలో ప్రముఖులు , పేదవాళ్ళు , మధ్యతరగతి వాళ్ళు అంటూ తేడా లేదు అందర్నీ ఓ చుట్టు చుట్టేస్తోంది. అలా కరోనా బారిన పడిన వాళ్లలో హాట్ భామ ” మలైకా అరోరా ” కూడా ఉంది.
గత ఏడాదిలో మలైకా అరోరా తో పాటుగా ఆమె ప్రియుడు అర్జున్ కపూర్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే కరోనా బారిన పడిన సమయంలో చాలా కష్టాలు పడిందట ఈ భామ. రెండు , మూడు రోజులైతే లేచి నిలబడటానికి , కూర్చోవడానికి కూడా నరకయాతన అనుభవించినట్లు వెల్లడించింది.
ఈ భామ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంది. అసలు రోజులో ఎక్కువగా చేసేది ఈ పనే ! దాంతో పాటు ప్రియుడితో సరస సల్లాపాల్లో తేలిపోతుంది. దాంతో రోజంతా అలా గడిచిపోతుంది కానీ కరోనా సోకిన సమయంలో ప్రియుడు పక్కన లేడు , ఒకవేళ దగ్గరగా ఉన్నా పెద్దగా సహాయం చేసేది లేదు అలాంటి సమయంలో పడిన ఇబ్బందులు వర్ణించలేమని అంటోంది.
అంతేకాదు కరోనా తగ్గిన తర్వాత వ్యాయామం చేయడానికి తన శరీరం సహకరించలేదని, ఒళ్ళు మొత్తం ఎక్కడికక్కడ విరిగిపోయినట్లుగా ఫీల్ అయ్యానని ఆ బాధ గురించి మాటల్లో చెప్పలేమని అంటోంది మలైకా.
అర్బాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వకముందు నుండే ప్రియుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న ఈ భామ ఆ తర్వాత అతడికి విడాకులు ఇచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఇక అప్పటి నుండి ప్రియుడు అర్జున్ కపూర్ తో వీర లెవల్లో ఎంజాయ్ చేస్తూ మీడియాకు పని చెబుతూనే ఉంది. తనకంటే వయసులో 12 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో స్వర్గ సుఖాలు అనుభవిస్తోంది మలైకా అరోరా.