అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విషాదం నెలకొంది. ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం రోజున మరణించింది. తన మొదటి భార్య మరణించిన విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించడం విశేషం. న్యూయార్క్ లోని తన సొంత ఇంట్లోనే ఆమె మరణించిందని వెల్లడించారు ట్రంప్. అయితే ఆమె మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
ట్రంప్ రియల్ ఎస్టేట్ డెవలపర్ గా ఉన్న సమయంలో మోడల్ అయిన ఇవానా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. అయితే 1993 లో ఇవానా కు విడాకులు ఇచ్చారు ట్రంప్. ఆ తర్వాత మార్లా మ్యాపుల్స్ ని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2005 లో మెలానియాని పెళ్లి చేసుకున్నాడు ట్రంప్. తన మొదటి భార్య మరణించడంతో తీవ్ర దుఃఖసాగరంలో ఉన్నాడు ట్రంప్.