ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ట్విట్టర్ తన చేతిలోకి రావడమే ఆలస్యం బోర్డ్ డైరెక్టర్ లను అందరినీ తొలగించాడు. అలాగే సీఈవో పరాజ్ అగర్వాల్ ని కూడా శాశ్వతంగా ట్విట్టర్ నుండి తొలగించాడు. ఇకపై ట్విట్టర్ కు తానొక్కడినే డైరెక్టర్ నని స్పష్టం చేశాడు.
అంతేకాదు కొత్త సీఈఓగా ఎవరినీ నియమించక పోవడంతో ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొత్త సీఈవో గా వ్యవహరించడం ఖాయమని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. పలువురు భారతీయులకు ఉద్వాసన పలికిన ఎలాన్ మస్క్ కొత్తగా మరో భారతీయుడికి సువర్ణావకాశం కల్పించాడు. తమిళనాడుకు చెందిన శ్రీరామ్ కృష్ణన్ సేవలను వినియోగించుకుంటున్నాడు.