ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society ) నాట్స్ సమావేశం లాస్ ఏంజెల్స్ లో జరిగింది. ఈ సమావేశానికి నాట్స్ కార్యవర్గం మొత్తం హాజరయ్యింది. కరోనా మహమ్మారి తర్వాత రెండేళ్లకు ఈ సమావేశం జరుగుతుండటం విశేషం. కరోనా భయంతో అందరూ కలవలేకపోయారు.
ఇప్పుడు కరోనా భయం తొలగిపోవడంతో సమావేశమయ్యారు. నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి లాస్ ఏంజెల్స్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని పరిచయం చేసారు.
లాస్ ఏంజెల్స్ చాప్టర్ కో – ఆర్డినేటర్ గా మద్దినేని మనోహర్ రావు , జాయింట్ కో – ఆర్డినేటర్ గా ముద్దన మురళి , నాట్స్ స్పోర్ట్స్ నేషనల్ కో – ఆర్డినేటర్ దిలీప్ సూరపనేని, ఈవెంట్స్ చైర్ బిందు కామిశెట్టి , హెల్ప్ లైన్ చైర్ శంకర్ సింగంశెట్టి , స్పోర్స్ట్ చైర్ కిరణ్ ఇమ్మడి శెట్టి , కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ అరుణ బోయినేని , మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ చైర్ ప్రభాకర్ రెడ్డి , ఫండ్ రైజింగ్ చైర్ గురు కొంక లతో పాటుగా నాట్స్ నాయకులు ఆలపాటి వెంకట్ , గరికపాటి వంశీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.