అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలా డెల్ఫియా లో బాలల సంబరాలు నిర్వహించింది. స్థానిక భారతీయ టెంపుల్ కల్చర్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరిగాయి. నెహ్రు జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. దాదాపు 160 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ నృత్యం ,సినీ నృత్యం ,సాంప్రదాయ సంగీతం, గణితం, సినీ సంగీతం, తెలుగు వకృతం, తెలుగు పదకేళి, చిత్రలేఖనం వంటి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేకమంది పిల్లలు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాలు నిలిచిన వారికి నాడ్స్ బహుమతులు అందించింది.
Breaking News