
smart phones : చిన్న పిల్లలు ఫోన్లకు అలవాటు పడుతున్నారు. ఏడాది వయసు కూడా లేని వారు ఫోన్లకు ఆకర్షితులవుతున్నారు. ఫోన్ లేనిదే ఏ పనిచేయడం లేదు. తిండి తినకపోయినా మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు మారాం చేయకుండా ఉండటానికి వారి చేతుల్లో ఫోన్ పెడుతున్నాం. దీంతో వారికి స్మార్ట్ ఫోన్ అలవాటు అవుతోంది. ఇక ఏ విషయంలో అయినా వారు మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తున్నారు.
మనం చేసే చిన్న పొరపాటు వల్ల పిల్లలు ఫోన్లతో ఆడుకుంటున్నారు. ఏడవడం మొదలు పెట్టారంటే ఫోన్ ఇచ్చే వరకు ఆపడం లేదు. ఈ నేపథ్యంలో ఫోన్ అలవాటు వారిని చెడగొడుతోంది. పిల్లలకు కథలు చెప్పకుండా ఇలా ఫోన్లు ఇస్తూ వారిని పాడు చేస్తున్నారు. పిల్లల భవిష్యత్ ను గందరగోళంలో పడేస్తున్నారు. దీనివల్ల వారు ఫోన్లు, టీవీలకు అలవాటు పడిపోతున్నారు.
కొందరు పిల్లలైతే ఫోన్లు లేనిదే ఏ పని చేయడం లేదు. తల్లిదండ్రులు ఇదేదో గర్వంగా చెప్పుకుంటున్నా దీంతో కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. వారికి ఫోన్లు ఇవ్వడం సముచితం కాదు. పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వాటితో ఎక్కువ సమయం గడిపితే వర్చువల్ అటిజం బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్ లు ఎక్కువ సమయం చూడటం వల్ల పిల్లలకు కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య వేధిస్తుంది. పిల్లల భవిష్యత్ ను దెబ్బతీసే స్మార్ట్ ఫోన్లకు వారిని దూరంగా ఉంచడమే శ్రేయస్కరం.