36.9 C
India
Sunday, May 5, 2024
More

    Low Price Smart Phones : అదిరిపోయే ఫీచర్లు.. అతి తక్కువ ధరకే.. ఈ స్మార్ట్ ఫోన్ల గురించి తెలిస్తే షాక్ అవుతారు..

    Date:

    Low price smart phones : ప్రజెంట్ డేస్ లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. దాదాపు లోకాన్ని చూసే చిన్నారి నుంచి రేపో మాపో పాడ ఎక్కే ముదుసలి వరకు సెల్ కు బానిసవుతున్నారు. ప్రపంచాన్ని తనకనుల ముందుకు తెస్తుంది సెల్ ఫోన్. సెల్ ఫీచర్స్ ను బట్టి లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అయితే రూ. 20వేల కంటే తక్కువ రేటుతో అధిరిపోయే ఫీచర్స్ ఉన్న సెల్స్ ఫోన్ గురించి తెలుసుకుందాం.

    రెడ్ మీ నోట్ 12
    బేసిక్ గా చైనా కంపెనీ అయినా ఇండియాలో తమ ఉత్పత్తులను మొదలు పెట్టింది షావోమీ. ఈ కంపెనీ నుంచి వచ్చిన మరో కంపెనీ ‘రెడ్ మీ’. రెడ్ మీలో ‘నోట్ 12’ రూ. 20 వేల కంటే తక్కువ ధరకు లభిస్తుంది. 5000mAh బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ద్వారా ఇది పని చేస్తుంది. 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగా పిక్సల్ మాక్రో సెన్సార్లను కలిగి ఉంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కి సపోర్ట్ చేస్తూ ఎక్కువ కాలం బ్యాటరీ పని చేస్తుంది. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ. 16,999 మాత్రమే.

    ఐక్యూ జెడ్-7
    ఐక్యూ జెడ్-7 కూడా మంచి మోడల్ ఫోన్. 5000mAh బ్యాటరీ, 44w ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పాటు 6.38 అంగులాల 90Hz AMOLED డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ సెల్ 64 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. దీని ధర కేవలం రూ. 18,999 మాత్రమే.

    మోటో జీ-73
    మోటోరోలాకు మంచి ఆదరణ ఉంది. ఇండియాలో ఈ ఫోన్లు ఎక్కువ సంఖ్యలో అమ్ముడు పోతాయి. మోటోరోలా మొబైల్ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ‘మోటో జీ-73’ స్మార్ట్ ఫోన్ చాలా పాపులర్ మోడల్. 6.5 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్ ప్లే ఉంది. బ్యాటరీ 5000mAh, 30W ఫాస్ట్ చార్జర్ కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 18,999 ఉంటుంది.

    రియల్ మీ-10 ప్రో (5G)
    రియల్ మీ 10 ప్రో 5Gలో మంచి ఫోన్. దీని ధర రూ. 18,999 ఉంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ తో ఎల్‌సీడీ ప్యానెల్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ తో నడుస్తుంది. 5000mAh బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ 33W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

    వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ (5G)
    ఆధునిక ఫీచర్స్ కలిగిన అద్భుతమైన మోడల్ ‘వన్ ప్లస్ నార్డ్ సీఈ-3 లైట్’ ఇది 5G నెట్ వర్క్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగులాల ఫుల్ హెడ్‌డీ+, ఎల్‌సీడీ డిస్ ప్లే, 2MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ తో పాటు హై రెజుల్యేషన్ 108MP ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ 67W ఫాస్ట్ చార్జర్ కలిగి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Apple 15 Series : తొలిసారి టైప్-సీ పోర్ట్‌తో ఐపోన్ 15 విడుదల..!

    Apple 15 Series : టెక్ కంపెనీ యాపిల్ మంగళవారం తన...

    Smart Phones : మీ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా దేని కోసం ఉపయోగిస్తున్నారో తెలుసా?

    Smart Phones : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. పిల్లల...

    Smart phones : చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం డేంజరే

    smart phones : చిన్న పిల్లలు ఫోన్లకు అలవాటు పడుతున్నారు. ఏడాది...

    స్మార్ట్ ఫోన్లతో పిల్లలకు ముప్పే తెలుసా?

    మన జీవితాల్లో సెల్ ఫోన్ ఎన్నో కష్టాలు తీసుకొస్తోంది. స్మార్ట్ ఫోన్లు...