40 C
India
Sunday, May 5, 2024
More

    Apple 15 Series : తొలిసారి టైప్-సీ పోర్ట్‌తో ఐపోన్ 15 విడుదల..!

    Date:

    Apple 15 Series
    Apple 15 Series

    Apple 15 Series : టెక్ కంపెనీ యాపిల్ మంగళవారం తన వండర్లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 9లను విడుదల చేసింది. ఇది కాకుండా, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 కూడా విడుదల చేసింది. ఛార్జింగ్ కోసం తొలిసారిగా కంపెనీ టైప్-సీ పోర్ట్‌ను అందించింది.

    ఈసారి ఐ ఫోన్-15లో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఐఫోన్ 15, 15 ప్లస్‌లలో A16 బయోనిక్ చిప్ అందించింది. అయితే A17 బయోనిక్ చిప్ ఐఫోన్ 15 Pro, Pro మాక్స్ లో అందుబాటులో ఉంటుంది. ప్రో మోడల్స్‌లో టైటానియం కూడా ఉపయోగించారు.

    భారతదేశంలో ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ ధర రూ. 79,900లు కాగా, ఐఫోన్ 15 ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ. 89,900లు పేర్కొంది. ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ రూ. 1,34,900కి, ప్రో మాక్స్ యొక్క 256 జీబీ వేరియంట్ రూ. 1,59,900కి అందుబాటులో ఉంటుంది.

    ఐఫోన్, వాచ్ సెప్టెంబర్ 22 నుంచి ..

    కొత్త ఐఫోన్‌ను సెప్టెంబర్ 15 సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఈ నెల 22 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. కొత్త ఆపిల్ వాచ్ ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది కూడా ఈనెల 22 నుంచి అందుబాటులోకి రానుంది. టైప్ సీ పోర్ట్‌తో ఎయిర్‌పాడ్స్ ప్రో రెండోతరం సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వస్తుంది.

    ఆపిల్ వాచ్ సిరీస్ 9ని కూడా..

    కంపెనీ ఆపిల్ వాచ్ సిరీస్ 9ని 8 కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. ఈ వాచ్‌లో డబుల్ ట్యాప్ ఫీచర్ అందింది. రెండు సార్లు వేళ్లతో నొక్కడం ద్వారా ఫోన్ కాల్ వెళ్తుంది. రెండు సార్లు ట్యాప్ చేయడంతో ఫోన్ కూడా డిస్‌కనెక్ట్ అవుతుంది. కంపెనీ యాపిల్ వాచ్ అల్ట్రా 2ను కూడా విడుదల చేసింది.
    ఇకపై తమ ఉత్పత్తుల్లో లెదర్‌ను ఉపయోగించబోమని యాపిల్ తెలిపింది. అమెరికాలో ఆపిల్ వాచ్ సిరీస్ 9 జీపీఎస్ వేరియంట్ ధర $399లు పేర్కొంది. GPS+ సెల్యులార్ ధర $499లు కాగా, వాచ్ అల్ట్రా 2 ధర $799లుగా పేర్కొంది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related