40 C
India
Sunday, May 5, 2024
More

    SRH VS RCB : సన్ రైజర్స్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    Date:

    SRH VS RCB
    SRH VS RCB

    SRH VS RCB : సన్ రైజర్స్ విజయాలకు ఆర్సీబీ బ్రేక్ వేసింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజత్ పటిదార్ కేవలం 19 బంతుల్లోనే 5 సిక్సులతో 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా సన్ రైజర్స్ స్పిన్నర్లను టార్గెట్ గా చేసుకుని సిక్సులు బాదాడు.

    విరాట్ కోహ్లి కూడా అర్థ సెంచరీతో రాణించాడు. విరాట్ మొదట స్పీడ్ గా ఆడిన తర్వాత స్లో అయ్యాడు. సన్ రైజర్స్ మొదట స్పిన్ తో బౌలింగ్ ప్రారంభించింది. అభిషేక్ శర్మ మొదటి ఓవర్ లో 10 పరుగులు సమర్పించుకున్నాడు. జై దేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కు ఒక్క ఓవర్ మాత్రమే ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.

    అనంతరం బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఫస్ట్ ఓవర్ లోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు చేసిన హెడ్ విల్ జాక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆర్సీబీ ప్రయోగం విల్ జాక్స్ రూపంలో ఫలించింది. లెఫ్ట్ హ్యండ్ బ్యాటర్ కు రైట్ ఆర్మ్ స్పిన్ తో బౌలింగ్ చేయించిన డుప్లెసిస్ హెడ్ ను బుట్టలో వేసే ప్లాన్ సక్సెస్ అయింది. తర్వాత అభిషేక్ శర్మ మూడు సిక్సులు, రెండు ఫోర్లు బాది గత మ్యాచ్ ఊపు కొనసాగించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 31 పరుగులు చేసి ఔటయ్యాడు. మార్కమ్, క్లాసెన్, నితిశ్ రెడ్డి, సమద్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

    అయితే షాబాద్, కమిన్స్ కాస్త జోరు ప్రదర్శించిన అది స్కోరు బోర్డుపై అంతరం తగ్గించేందుకు మాత్రమే పనికొచ్చింది. కమిన్స్ మూడు సిక్సులు బాది 15 బంతుల్లోనే 31 పరుగులు చేసినా ఆ తర్వాత ఔట్ కావడంతో సన్ రైజర్స్ ఓటమి ఖాయమైంది. చివరి వరకు క్రీజులో ఉన్న షెహబాజ్ 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ రాణించి సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 171/8 తో ఇన్సింగ్స్ ను ముగించింది. ఆర్సీబీకి ఆరు మ్యాచ్ ల తర్వాత ఓ విజయం దక్కడం ఊరట కలిగించింది.

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...