UBlood యాప్ విశిష్టత తెలిపేలా అట్టహాసంగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగింది. భారత్ తో పాటుగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 40 యూనివర్సిటీల స్టూడెంట్స్, అధ్యాపకులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడం విశేషం. స్టడీ మెట్రో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సందర్భంగా యు బ్లడ్ యాప్ గురించి JSW & Jaiswaraajya యూట్యూబ్ ఛానల్స్ కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ తో పాటుగా ప్రతినిధి బృందం పాల్గొని యు బ్లడ్ యాప్ విశిష్టత ను తెలిపారు.
యు బ్లడ్ యాప్ సర్వరోగ నివారిణి ……. సంజీవని లాంటిదని స్టూడెంట్స్ తో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే యు బ్లడ్ ఫౌండర్ జై పై ప్రశంసలు కురిపించారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ యు బ్లడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.