32.6 C
India
Saturday, May 18, 2024
More

    Lokash VS JRNTR : లోకేశ్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్.. వారి భవిష్యత్ ఏంటంటే..?

    Date:

     JRNTR VS Lokash
    JRNTR VS Lokash

    Lokash VS JRNTR :ఈ మధ్య సినిమా, పొలిటికల్ స్టార్ల జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ సాధారణ వ్యక్తులకు కలుగుతుంది. దీంతో వారి జ్యోతిష్యం గురించి చెప్పే వారు కూడా ఫేమస్ అవుతున్నారు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్ల జీవితాలలో ముఖ్య ఘట్టాలను మందే చెప్పిన జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా మరో జ్యోతిష్యుడు పీవీఆర్ నరసింహారావు పొలిటికల్, సినిమా స్టార్ జాతకాలను వివరించాడు. ఇప్పుడు ఆయన మాటలు వైరల్ అయ్యాయి. పీవీఆర్ నరసింహారావును ఐఐటీ విద్యార్థిగా, అమెరికాలో ఇంజినీరింగ్ మేనేజర్ గా, వేద జ్యోతిష్కుడిగా సంస్కృత పండితుడుగా, తత్వవేత్త, ఫైర్ యోగిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

    జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేశ్ రెండు భిన్న ధ్రువాలు. కానీ బంధువులు. ఒకరు సినిమా ప్రపంచంలో స్టార్ గా ఎదిగితే.. మరొకరు ఇప్పుడిప్పుడే పొలిటికల్ లోకి వస్తున్నారు. వీరిద్దరి జీవితాల్లో జరగబోయే విషయాల గురించి ప్రముఖ జ్యోతిష్కుడు పీవీఆర్ నరసింహారావు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ జాతకాన్ని ఆయన తండ్రికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నుంచి ఎప్పుడో తీసుకున్నాను. నారా లోకేశ్ జాతకం మాత్రం ఈ మధ్యనే తనకు అందిందని చెప్పాడు పీవీఆర్ నరసింహా రావు. ఇద్దరి జాతకాలను సరిపోలిస్తే కొన్ని విస్తుపోయే విషయాలు తెలిశాయని ఆయన చెప్పారు.

    నారా లోకేశ్ కొందురు అనుకుంటున్నట్లుగా పప్పు కాదు. చాలా తెలివైనవాడు, కానీ స్ట్రీట్ స్మార్ట్ కాదు. అంతేకాక, అతనికి పెద్దగా అడ్డుగా ఉంది అహమే, ఇదే ఆయనకు అతిపెద్ద శత్రువు! ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ లో చాలా పేలవంగా ఉంటాడు. వచ్చే పదేళ్లలో ఆయన సీఎం అయ్యే అవకాశం ఏ మాత్రం లేదు. ఆయన, జూనియర్ ఎన్టీఆర్ తో ఎప్పటికీ కలవరు. వారి లగ్నాలు సింహ మరియు మకరాలు ఎల్లప్పుడూ విభేదాలు కలిగి ఉంటారు.

    ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే చాలా తెలివైనవాడు, ప్రాపంచిక జ్ఞాని, చాలా ఉన్నత భావోద్వేగ తెలివితేటలు, అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉన్నాయి. అతనికి కూడా అహం ఉంటుంది. కానీ దాన్ని ఎలా నియంత్రించుకోవాలో ఆయనకు తెలుసు.  అలాగే, రాబోయే సంవత్సరాల్లో ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. రాబోయే దశాబ్ద కాలంలో ప్రజల్లో ఆయన పాపులారిటీ విపరీతంగా పెరుగుతుంది. దాన్ని తన తాత ఎన్టీఆర్ గారిలా రాజకీయ విజయంగా మలచుకోవడంలో ఆయన సక్సెస్ సాధిస్తాడు. వచ్చే 15 ఏళ్లలో ఆయన ఖచ్చితంగా రాజకీయ విజయాన్ని, అధికారాన్ని అనుభవిస్తారు. కానీ ప్రస్తుత ఎన్నికల చక్రంలో కాదు. ఇంకా టైముంది.

    Share post:

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lokesh : లోకేశ్ ఆ వీడియోలు భార్య బ్రాహ్మిణి చూసిందా? వైరల్ వీడియో

    Lokesh  యువరాజు నారా లోకేశ్ గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుంటుంది. బాబు...

    ఆస్కార్ నామినేషన్స్ 2023 జాబితా ఇదే

    ఆస్కార్ బరిలో ఈసారి ఆర్ ఆర్ ఆర్ నిలవడంతో తీవ్ర ఉత్కంఠ...