నిజామాబాద్ ఎంపీగా 2014 లో సంచలన విజయం సాధించింది కవిత. పార్లమెంట్ లో వివిధ అంశాలపై అనర్గళంగా మాట్లాడి అందరి అభిమానాన్ని చూరగొంది. కేసీఆర్ కూతురుగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వాగ్దాటిలో కేసీఆర్ కు ఎంతమాత్రం తగ్గకుండా వాదనలు వినిపించి తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. పార్లమెంట్ సభ్యురాలిగా పలు సమస్యలను ప్రస్తావించి అందరి ప్రశంశలు అందుకుంది.
కట్ చేస్తే 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 70 వేలకు పైగా తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దాంతో కొన్నాళ్ల పాటు కవిత ఇంట్లో నుండి బయటకు రాలేకపోయింది. ఇక కవిత ఓటమి గులాబీ శ్రేణులను మాత్రమే కాదు కేసీఆర్ ను అలాగే కేటీఆర్ ను షాక్ అయ్యేలా చేసింది. సారూ …… కారు ….. 16 అనే నినాదంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసింది అప్పటి TRS ఇప్పటి BRS.
అయితే అనూహ్యంగా ఆ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 స్థానాలను కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను గెలుచుకొని కేసీఆర్ కు గట్టి షాక్ నిచ్చాయి. 7 లోక్ సభ స్థానాలలో గులాబీ దళం ఓడిపోయింది. ఇది కేసీఆర్ , కేటీఆర్ లను షాక్ కు గురిచేయలేదు కానీ నిజామాబాద్ లో కవిత ఓడిపోవడమే పెద్ద షాక్. ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలా రోజులే పట్టింది.
అయితే నిజామాబాద్ లో కవిత ఓటమికి బీజేపీ కారణం అని అనుకున్నారు అంతా . కానీ అసలు విషయం ఏంటంటే కవిత ఓటమికి BRS లోని అగ్రనేత ఒకరు కారణమని తెలుస్తోంది. ఈ విషయం అధినేత కేసీఆర్ కు యువనేత కేటీఆర్ కు కూడా తెలుసట కానీ బయటకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో. ఆ కీలక నేత ఎవరు అనేది గులాబీ పార్టీ లోని వాళ్లకు కూడా తెలుసట కానీ బయటకు మాత్రం చెప్పరు.
ఎందుకంటే కేసీఆర్ కుటుంబ రాజకీయాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. ఆ నాయకుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎమ్మెల్యేగా . కానీ అతడి పై ఎలాంటి చర్యలకు కేసీఆర్ సిద్ధం కావడం లేదు. అతడిపై చర్యలు తీసుకుంటే పార్టీకి ప్రమాదమని భావించడమే అందుకు కారణమని , అయితే అవకాశం చిక్కినప్పుడు మాత్రం తప్పకుండా కొరడా ఝుళిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కవిత ఎంపీగా ఓడిపోవడంతో ఆమెను ఎమ్మెల్సీ ని చేసిన విషయం తెలిసిందే. ఇక ఎమ్మెల్సీ పదవీకాలం కూడా అయిపోయే సమయం వచ్చేసింది ….. అయితే త్వరలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నట్లు ఊహాగానాలు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి.