School తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తోంది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రెండు రోజులు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శనివారం మొహర్రం, ఆదివారం వరకు సెలవులు ఇచ్చినట్లయింది. తిరిగి విద్యాసంస్థలు సోమవారం పున: ప్రారంభం అవుతాయి.
వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దీని వల్ల పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇన్ని రోజులు వర్షాలు లేవు అని బాధపడినా ఇప్పుడు విరామం లేకుండా వానలు పడుతున్నాయి.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. బుధ, గురు వారాలు ఇదివరకే సెలవు ప్రకటించగా శుక్రవారం కూడా సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో ఒకేసారి నాలుగైదు రోజులు సెలవులు ఒకేసారి వచ్చినట్లు అయింది. తాజా సెలవుతో ఇలా మూకుమ్మడి సెలవులు ఇచ్చినట్లు కావడం గమనార్హం.
వర్షాలు అసలు విరామం ఇవ్వకుండా కురుస్తున్నాయి. దీంతో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. దీని వల్ల పాఠశాలలకు సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టాకే పాఠశాలలు తిరిగి ప్రారంభించనున్నారు.