కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నామని, అంతేకాని పదవుల కోసం మేము పాకులాడటం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పదవులకు రాజీనామా చేసారు రేవంత్ రెడ్డి అనుచర బృందం. సీతక్క , వేం నరేందర్ రెడ్డి లతో పాటుగా మరో 10 మంది కాంగ్రెస్ నాయకులు తమ పదవులకు రాజీనామా చేసారు.
కాంగ్రెస్ పార్టీలో వలసవాదులకు అగ్రతాంబూలం దక్కుతోంది కానీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్న సీనియర్ నాయకులను మాత్రం పట్టించుకోవడం లేదు సరికదా …… అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు సీనియర్ నాయకులు సమావేశమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుండటంతో రేవంత్ అనుచర బృందంగా పేరుపడిన వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేశారు.