29.5 C
India
Sunday, May 19, 2024
More

    బండి సంజయ్ అరెస్ట్

    Date:

    telangana bjp chief bandi sanjay arrested in paper leak
    telangana bjp chief bandi sanjay arrested in paper leak

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ని తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నిన్న రాత్రి హైడ్రామా నడుమ కరీంనగర్ లో బండి సంజయ్ ను అరెస్ట్ చేసారు పోలీసులు. పదవ తరగతి పరీక్షా పేపర్ లు లీకైన ఘటనలో బండి సంజయ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3 న పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా మొదటి  రోజునే తెలుగు పేపర్ లీక్ కాగా రెండో రోజున కూడా హిందీ పేపర్ లీక్ అయ్యింది. దాంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

    కరీంనగర్ అదనపు డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో 50 మందికి పైగా పోలీసులు బండి సంజయ్ ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ….. అరెస్ట్ వారెంట్ ఉందా ? అంటూ పోలీసులతో వాదనకు దిగాడు ? ఈలోపు బండి సంజయ్ ఇంటికి పోలీసులు వచ్చారన్న సమాచారంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు . దాంతో బండి సంజయ్ ను అరెస్ట్ చేసి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

    బండి సంజయ్ అరెస్ట్ పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు , ధర్నాలు నిర్వహిస్తోంది. అయితే బండి సంజయ్ ను పేపర్ లీకేజ్ లో అరెస్ట్ చేశామని , పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొనడం సంచలనంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ బరిలో ఈటల నిలుస్తారా?

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది....