Horoscope మేష రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ స్వభావం వల్లే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈశ్వర దర్శనం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
వృషభ రాశి వారికి మనోధైర్యం కలిగి ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవాన్ని పూజించడం మంచిది.
మిథున రాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అలుపు లేకుండా పనిచేస్తే అనుకూలతలు ఉంటాయి. నిద్రాహారాలు సరిగా ఉండాలి. శ్రీరామ నామాన్ని జపిస్తే మంచిది.
కర్కాటక రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈశ్వర దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
సింహ రాశి వారికి మనోబలం పెరుగుతుంది. పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిర్లక్ష్యం వదిలేయండి. విష్ణుమూర్తి దర్శనం శుభాలు కలిగిస్తుంది.
కన్య రాశి వారికి మంచి కాలం. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
తుల రాశి వారికి చేపట్టిన పనులు పూర్తవుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక భయం తొలగిపోతుంది. శివధ్యాన శ్లోకం చదవడం వల్ల మంచి లాభాలు కనిపిస్తాయి.
వృశ్చిక రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శివారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి వారికి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం. కష్టపడి పనిచేయాలి. సాయి నామం స్మరిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మకర రాశి వారికి శుభకరమైన పరిస్థితులు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల కాలం. ఆరోగ్యం బాగుంటుంది. గురుధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.
కుంభ రాశి వారికి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. దుర్గారాధన చేయడం ఉత్తమ ఫలితాలు అందిస్తుంది.
మీన రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మనోధైర్యం పెరుగుతుంది. ఆంజనేయుడిని స్మరిస్తే మంచి జరుగుతుంది.