6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. శివపార్వతులను పూజిస్తే మంచి ఫలితాలుంటాయి.
వ్రషభ రాశి వారికి శత్రువులపై పైచేయి సాధిస్తారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. శివుడిని దర్శిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
కర్కాటక రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. ఇష్టదేవతారాధన శుభకరం.
సింహ రాశి వారికి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దు. శనిధ్యానం చేయడం మంచి ఫలితాలు తెస్తుంది.
కన్య రాశి వారికి మనోబలం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. పనుల్లో పురోగతి దక్కుతుంది. దైవారాధన మంచిది.
తుల రాశి వారికి సమయానికి సాయం చేసే వారుంటారు. మీరు తీసుకునే నిర్ణయాల్లో పెద్దవారి పాత్ర ఉంటుంది. గోవింద నామాలు చదవడం శ్రేయస్కరం.
వ్రశ్చిక రాశి వారికి కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నవగ్రహ శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలున్నాయి.
ధనస్సు రాశి వారికి గొడవలకు దూరంగా ఉండాలి. అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. శివనామస్మరణ చేయడం మేలు చేస్తుంది.
మకర రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. గొడవలకు దిగకపోవడమే శ్రేయస్కరం. దైవారాధన చేయడం శుభకరం.
కుంభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల వైపు ఫోకస్ పెడతారు. ఇష్టదేవతను కొలవడం మంచిది.
మీన రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దైవారాధన మంచి ఫలితాలు కలిగిస్తుంది.