మేషం :
ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలలో సోదరుల, సన్నిహితుల సలహాలు తీసుకుంటారు . ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. స్వగృహ నిర్మాణం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలను మరింతగా విస్తరించాలనుకునే వారికి మంచి కాలమే ! కళారంగాలలో ఉన్నవాళ్లకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వారం మధ్యలో కాస్త చికాకులు. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తూర్పు ప్రయాణం అనుకూలం. మరిన్ని లాభాల కోసం ఆంజనేయ దండకం పఠించండి.
వృషభం :
పనులు అనుకున్న విధంగా పూర్తి చేసినప్పటికీ , ఆర్ధిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ప్రారంభం కాకపోయినా వారం చివర్లో మంచి ఫలితమే వస్తుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు , వస్తులాభం కూడా. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయంతో వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి , మిత్రుల సహకారం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్లకు లాభం చేకూరుతుంది. కుటుంబంలో చికాకులు , ధనవ్యయం . దక్షిణ దిక్కు ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్ర నామం పఠించండి.
మిథునం :
వివాదాల నుండి బయటపడతారు. కొత్తగా ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు కేసులు పరిష్కార దిశకు చేరుకుంటాయి దాంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాహనాలు , ఆభరణాలు కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. ఉద్యోగులు సంతృప్తిగా తమ కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులతో కాస్త విబేధాలు ఏర్పడతాయి. అనారోగ్యం సూచిస్తోంది. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీరామ స్త్రోత్రం పఠిస్తే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు.
కర్కాటం :
దీర్ఘ కాళిక సమస్యలనుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పనులు ఉత్సాహంతో పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు, వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. గృహ నిర్మాణాల్లో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఉద్యోగులకు అడ్డంకులు తొలగుతాయి. కళారంగంలో ఉన్నవాళ్లకు కలిసి వస్తుంది. కుటుంబంలో కాస్త చికాకులు ఏర్పడతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు కలిసి వస్తాయి. విష్ణు పారాయణం చేయండి.
సింహం :
ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. ఒత్తిడులు అధికమౌతాయి . రుణాల కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అన్ని ప్రయత్నాలు కూడా నిరాశకు గురిచేస్తాయి. మీ ప్రత్యర్థులను ఓ కంట కనిపెడుతూనే ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన స్థాయిలో లాభాలు రావు. ఉద్యోగస్తులకు కొత్త చిక్కులు సవాల్ గా మారతాయి. పారిశ్రామిక రంగాల వారికి కొన్ని చిక్కులు ఎదురౌతాయి. అయితే వారం మధ్యలో శుభవార్తలు వింటారు , ఆకస్మిక ధనలాభం. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కన్య :
చేపట్టాల్సిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. రుణ భారాలు తగ్గే సూచనలు , ఆర్ధికంగా కొంత అనుకూలం. బంధు మిత్రుల సహకారంతో వివాదాలనుండి బయటపడతారు. నిరుద్యోగులకు , విద్యార్థులకు ఓ ప్రకటన అమితంగా ఆకర్షిస్తుంది. గృహ నిర్మాణంలో కొంత ముందడుగు పడుతుంది. ధనలాభం , వాహనయోగం. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులు తమకు ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయాల్లో ఉన్నవాళ్లకు కాస్త కలిసి వచ్చే అవకాశం. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గా మాత స్త్రోత్రాలు పఠించడం మంచిది.
తుల:
ఆర్ధిక పరిస్థితి మెరుగు అవుతుంది. కళారంగంలో కొత్త అవకాశాలు మిమ్మల్ని ఉత్తేజితులను చేస్తుంది. సన్నిహితులు , మిత్రుల సహకారంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భూములు , వాహనాలు కొనుగోలు చేయాలనీ ప్రయత్నాలు చేస్తారు కొంతవరకు సఫలం అవుతారు. మీ ప్రత్యర్ధులు సైతం మీకు కలిసి వస్తారు , కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుంది , స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్తుతి కలిసి వస్తుంది.
వృశ్చికం :
సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులలో విజయం , ఆర్ధిక లావాదేవీలు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆస్థి వివాదాలు పరిష్కారం కావడంతో ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం . ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూల్ అవుతాయి. వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్న చిక్కులు తొలగుతాయి. రాజకీయాలలో ఉన్నవాళ్లకు మరింత మంచి కాలం. స్వల్ప ఘర్షణలు , అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర దిశ ప్రయాణాలు మంచిది. గణేశాష్టకం పారాయణం చేయడం మంచిది.
ధనుస్సు :
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వాగ్దాటితో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. కొంత కాలంగా వివాదాలలో ఉన్న స్థిరాస్తి ఎట్టకేలకు పరిష్కారం అవుతుంది. స్వగృహ నిర్మాణం కు నడుం కడతారు. నిరుద్యోగులకు కాస్త కలిసి వచ్చే కాలం. వ్యాపారస్తులకు మరింత అనువైన కాలం. ఉద్యోగులకు కొంత అనుకూలం , శ్రమ తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. స్వల్ప విబేధాలు. తూర్పు దిశ ప్రయాణాలు కలిసి వస్తాయి. హనుమాన్ చాలీసా పఠించండి.
మకరం :
చేపట్టిన వ్యవహారాల్లో కొంత పురోగతి. బంధువుల నుండి అందిన సమాచారం ఊరట నిస్తుంది. గృహ , వాహన కొనుగోలు చేయాలనీ భావిస్తారు ….. కొంతవరకు కలిసి వస్తుంది కూడా. కోర్టు వ్యవహారాల్లో కొంత అనుకూలత. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగిపోతాయి. కళారంగంలో ఉన్నవాళ్లకు మరిన్ని మంచి అవకాశాలు. ఉద్యోగస్తులకు కొత్త విధులు ఉత్సాహాన్నిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప ఇబ్బందులు , బంధు మిత్రులతో విబేధాలు అలాగే స్వల్ప అనారోగ్య సూచనలు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. దేవీ ఖడ్గమాల పఠించండి.
కుంభం :
పనులు కొంత నిదానంగా ప్రారంభం అవుతాయి. బంధు మిత్రుల సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనిలో బాధ్యతాయుతంగా ప్రవర్తించి మెరుగైన ఫలితం రాబడతారు. గృహం , వాహనం కొనాలని సంకల్పిస్తారు ఆమేరకు విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యం చేయాలనే తలంపుతో ఉంటారు. ఓ సంఘటన మీలో మార్పు తెస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయాల్లో ఉన్నవాళ్లు సంతోషకరమైన వార్తలు వింటారు. వారం ప్రారంభంలో ధనవ్యయం , స్వల్ప అనారోగ్యం. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్త్రోత్రాలు పఠించడం మంచిది.
సింహం :
పనుల్లో విజయం , సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని వేడుకలకు రంగం సిద్ధం చేస్తారు. ఉన్నత హోదాలో ఉన్నవాళ్ళతో పరిచయాలు లభిస్తాయి. భూములు , వాహనాలు కొంటారు. ఓ ముఖ్యమైన సమాచారం మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. వ్యాపారస్తులకు మంచి కాలం. ఉద్యోగస్తులకు కలిసి వచ్చే కాలం. కళారంగంలో ఉన్నవాళ్లకు వివాదాలు సద్దుమణిగే కాలం. వారం మధ్యలో ధనవ్యయం , కుటుంబంలో స్వల్ప ఘర్షణలు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామారక్షా స్త్రోత్రాలు పఠించడం మంచిది.
Breaking News