24 C
India
Saturday, September 12, 2026
More

    ఆదిపురుష్ పై విమర్శలు చేయడం తగదు.. హరీష్ శంకర్

    Date:

    ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విడుదలకు ముందే వివాదాలకు కేంద్రంగా మారిన సినిమాపై సీనియర్ దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. ఆదిపురుష్ లో అభ్యంతరాలు ఉంటే సెన్సార్ వాళ్లే చూసుకుంటారు. దీనికి ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో తీయడంతో కొన్ని విషయాల్లో పద్ధతులు పాటించడం కుదరదు.

    అంతేకాని అనవసర పోస్టింగులు పెట్టడం సమంజసం కాదని హరీష్ శంకర్ కౌంటర్ ఇచ్చాడు. సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం బాగా లేదని హితవు పలికాడు. సినిమా నిర్మించడమంటే మాటలు కాదు. దానికి చాలా సహనం కావాలి. ఎన్నో విషయాలు ఆలోచించాలి. అందరు సహకరిస్తేనే సినిమా పూర్తవుతుంది. ఈ విషయాలు తెలియని వారు ఇలా విమర్శలు చేస్తుంటారు.

    రామానంద సాగర్ తెరకెక్కించిన రామాయణం సిరీస్ అద్భుతమైన ప్రాచుర్యం పొందింది. 90వ దశకంలో ప్రసారమైన ఇది చరిత్రలో నిలిచిపోయింది. సోషల్ మీడియా హ్యాండిల్ ఆ టీవీ సిరీస్ దృశ్యాలను పోస్టు చేస్తూ దీనికి ఏదీ సాటి రాదు అంటూ కామెంట్లు పెట్టడంపై హరీష్ మండిపడ్డారు. నోరుంది కదా అని విమర్శిస్తే ప్రతిదాన్ని విమర్శించొచ్చు. కానీ దానికి వారు ఎంత కష్టపడ్డారో తెలిస్తే అలా చేయరు.

    రామాయణ్ విషయంలో ఎవరికి అనుమానం రాలేదు. కానీ ఆదిపురుష్ రిలీజ్ కు ముందు ఇలాంటి పోస్టులు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మంలో భాగంగానే సినిమా నిర్మించారని దాని మీద కూడా విమర్శలు చేయొద్దని హితవు పలికారు. హరీష్ శంకర్ చేసిన కౌంటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆదిపురుష్ గురించి ఇలాంటి పోస్టులు సరైనవి కావని చెబుతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Prabhas : ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం...