జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అవతార్ 2. దశాబ్దం క్రితం వచ్చిన అవతార్ చిత్రానికి ఇది సీక్వెల్. అవతార్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు డిసెంబర్ 16 న అంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ప్రపంచమంతా అవతార్ 2 మేనియాతో ఊగిపోతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ తో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులకు స్పెషల్ షో వేశారు. కాగా ఆ షోకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా వెళ్ళాడు. సినిమా చూసాక జేమ్స్ కామెరూన్ కు తలవంచి నమస్కరించాలనిపించిందని , ఇదొక అద్భుతం అంతకంటే ఏమి చెప్పాలి అంటూ అవతార్ 2 పై తన రివ్యూ ఇచ్చేసాడు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అవతార్ 2 సంచలన వసూళ్లు నమోదు చేస్తోంది. ఇక ఈ సినిమా ముందు ముందు ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో ఊహించలేకపొతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరో పదేళ్ల వరకు కూడా అవతార్ 2 రికార్డుల గురించి కనీసం ఆలోచించడం కూడా వృధా అని అంటున్నారు. ఎందుకంటే అవతార్ 2 వసూళ్లు చూసి తేరుకోవడానికి , మాట్లాడుకోవడానికి మాటల్లేవ్ …… మాట్లాడుకోవడాల్లేవ్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.