మద్యం గ్లాసుతో యాంకర్ అనసూయ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల ఓ రాత్రి పార్టీలో జాయిన్ అయిన అనసూయ మద్యం తాగుతున్న సమయంలో రకరకాల భంగిమల్లో ఫోటోలు తీశారు. ఇంకేముంది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మద్యం గ్లాసు పట్టుకొని హాయిగా నవ్వుతున్న అనసూయ ……. మద్యం గ్లాసు పట్టుకొని ముఖానికి ఒక చేయి అడ్డుపెట్టుకొని సిగ్గుపడుతున్న అనసూయ …… మత్తుగా చూస్తున్న అనసూయ ….. ఇలా రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది.
ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు ఎంతగా కామెంట్ చేస్తున్నా అనసూయ మాత్రం తాను ఇవ్వాలనుకున్న వాటికే సమాధానాలు ఇస్తుంది. మిగతావాటిని పట్టించుకోవడం లేదు. అయితే తనను ఎవరైనా ఆంటీ అంటే మాత్రం అనసూయ కోపం నషాళానికి ఎక్కుతుంది.
ఇప్పటికే కొంతమంది మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తనని అసభ్యకరణమైన రీతిలో ఫోటోలను మార్ఫింగ్ చేయించిన వాడ్ని అరెస్ట్ చేయించింది కూడా. ఒకవైపు వెండితెర మరోవైపు బుల్లితెర ఇలా రెండు మాధ్యమాల్లో సత్తా చాటుతోంది అనసూయ. అయితే ఇటీవల ఎక్కువగా వెండితెరకు మాత్రమే అంటోంది. చేతిలో ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి అనసూయకు.
View this post on Instagram