Rashmika Mandanna liplock రష్మిక మందన్నా అంటే ఇప్పుడు నేషనల్ క్రష్ గా దూసుకుపోతోంది. ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ ఇప్పుడు బడా ప్రాజెక్టులే. టాలీవుడ్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్ దాకా ఆమె హవా సాగుతోంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ వన్ ఎవరు అంటే అందరూ టక్కున రష్మిక పేరు చెప్పే స్థాయికి ఆమె ఎదిగిపోయింది.
ఆమెకు పుష్ప సినిమా తర్వాత నుంచే పాన్ ఇండియా ఫేమ్ వచ్చింది. అంతకు ముందు ఆమె చేసిన సినిమాలు దాదాపు అన్నీ హిట్టే అయ్యాయి. ఒక రకంగా ఆమెకు లక్ బాగానే కలిసి వస్తోంది. అందుకే చేస్తున్న సినిమాలు అన్నీ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది.
ఇక ప్రస్తుతం ఆమె ముంబైలోనే ఎక్కువగా ఉంటుంది. తాజాగా అక్కడి మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తాను ఎదుర్కున్న ఓ ఘటనను వివరించింది. నేను విజయ్ దేవరకొండతో కలిసి రెండు సినిమాలు చేశాను. డియర్ కామ్రేడ్ సినిమాలో కొన్ని లిప్ లాక్ సీన్లు ఉన్నాయి.
ఆ సీన్లు చూసి చాలామంది నన్ను ట్రోల్స్ చేశారు. చాలా దిగజారిపోయావ్ అంటూ దారుణంగా తిట్టారు. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. ఎవరైనా ఏమైనా అంటే అస్సలు భరించలేను. కానీ నటిగా నన్ను నేను నిరూపించుకోవడం నాకు మఖ్యం అని నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను. నా ఫ్రెండ్స్ కూడా నాకు ధైర్యం చెప్పారు. అందుకే ఈరోజు ఇంత ఫ్రీగా సినిమాలు చేస్తున్నాను అంటూ ఎమోషనల్ అయింది ఈ భామ. ఇక ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.